ప్రభాస్‌లో మాస్ ఎలిమెంట్ ఎలివేట్ చేస్తే... ఆ సినిమా ఏ రేంజి హిట్ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కటౌట్‌కి తగ్గ కథ తీసుకొస్తే సాధించే విజయం మామూలుగా ఉండదు. అలాంటి హీరోకు.. మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసబెట్టి భారీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న ప్రభాస్.. తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్, `ఆదిపురుష్` సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలూ పట్టాలెక్కకముందే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
`కేజీఎఫ్`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు `సలార్` అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ప్రభాస్ డేట్స్ ఎప్పటినుంచి ఎలాట్ చేసాడు అనే విషయాలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ చిత్రం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రామాకు ప్రభాస్ జనవరి చివరి వారం నుంచి డేట్స్ ఎలాట్ చేసాడు. ఈ సినిమాలో మేజర్ పోర్షన్ కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేస్తారు. మిగిలినది 2021 ఆగస్ట్ తర్వాత ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమాని దసరా 2021 కు రిలీజ్ చేద్దామని ప్లాన్. కుదరకపోతే 2022 సంక్రాంతికే రిలీజ్ కానుంది.
అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. హాట్ బ్యూటీ, ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ దిశా పటానిని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. దిశ గతంలో వరుణ్ సరసన `లోఫర్` సినిమాలో మెరిసింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో షార్ప్ లుక్ తో ఒక చేతిని గన్ పై పెట్టి దర్జాగా కూర్చుని ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ వచ్చింది, ఈ చిత్రం నీల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుంది. ప్రభాస్‌లో మాస్ ఎలిమెంట్ ఎలివేట్ చేస్తే... ఆ సినిమా ఏ రేంజి హిట్ సాధిస్తుందో మనందరికీ తెలిసిందే. ఆ కటౌట్‌కి తగ్గ కథ తీసుకొస్తే సాధించే విజయం మామూలుగా ఉండదు. అలాంటి హీరోకు.. మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో దిట్ట అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
హొంబెల్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2ను నిర్మించిన విజయ్ కిరుగందుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
ఇక గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా కలగలపి ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ స్క్రిప్టుకే కాస్తంత మెరుగులు దిద్ది ప్రబాస్ తో చేయబోతున్నాడని చెప్తున్నారు.