#Salaar: నైజాం రైట్స్ మాసివ్ ఆఫర్,దిల్ రాజు గట్టిగా కోట్ చేసాడు

Published : Aug 29, 2023, 06:45 AM IST
 #Salaar: నైజాం రైట్స్ మాసివ్ ఆఫర్,దిల్ రాజు గట్టిగా కోట్ చేసాడు

సారాంశం

 కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్లు అందించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 


పాన్ ఇండియా హీరోగా రికార్డులు క్రియేట్ చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా అంటే క్రేజ్, బిజినెస్ రేంజ్ వేరేగా ఉంటుంది. అందులోనూ కేజీఎఫ్ తీసిన డైరక్టర్ తో సినిమా అంటే ఆ లెక్కలే వేరు. సాధారణంగా ఓ  కొత్త సినిమా థియేట్రికల్ రైట్స్ కొనే ముందు సదరు హీరో లాస్ట్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? అనేది పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు చూస్తారు. 

ఆ లెక్కన చూస్తే #Salaar రేట్లు పెద్ద పలకకూడదు.  'ఆదిపురుష్' ఆశించిన రీతిలో ఆడలేదు కాబట్టి సోసోగా ఉండాలి.  అయినా ప్రభాస్ కథే వేరు. ఆయన గత చిత్రానికి తాజా చిత్రం బిజినెస్ సంభందం ఉండటం లేదు.  'సలార్' థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే రేటుకు అమ్మడానికి, కొనడానికి రంగం సిద్ధం అవుతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్  నైజాం హక్కులకు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు..65 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్, 15 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ కోట్ చేసారు. 'సలార్' తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ నుంచి హోంబలే ఫిలిమ్స్ సంస్థ రూ. 200 కోట్ల దాకా రాబట్టాలని చూస్తోందని సమాచారం.  
 
ఇదిలా ఉంటే ‘సలార్’ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల విష‌యంలో ఓ రేంజిలో  క్రేజ్ వ‌చ్చింది. దీంతో మేక‌ర్స్   ఈ మూవీ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు ఫిక్స్ చేశారని సమాచారచం. అంటే స‌లార్ ఓవ‌ర సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 9 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. బాహుబ‌లి సినిమా కె.జి.య‌ఫ్, ఆర్ఆర్ఆర్‌ చిత్రాల త‌ర్వాత ఆ రేంజ్ రేట్‌ ఓవ‌ర్ సీస్ రైట్స్‌కు ఫిక్స్ చేశారు. ఈ క్రేజ్ కు కార‌ణం..  ప్ర‌భాస్,  ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అని ట్రేడ్ వ‌ర్గాలు సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి మాట్లాడుతూ ఏ సినిమాలో ప్రభాస్ ని ఇంతవరకు ఎప్పుడు చూపించని విధంగా చూపిస్తున్నట్లు చెప్పారు . ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినిమాలో నేను చాలా క్రూరంగా కనిపిస్తానని చెప్పాడు. ఇలాంటి పాత్రలు ఇంతకుముందు ఎప్పుడూ నటించలేదు అని ఆయన చెప్పారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.   పాన్ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేయనుంది. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా