#Salaar బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి

Published : Dec 17, 2023, 12:28 PM IST
  #Salaar బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి

సారాంశం

 సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే కష్టమేమీ కాదు, డిసెంబర్ నెలాఖరకు రికవరీ అయ్యిపోవచ్చు  అంటున్నారు. ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో చేసారని వినికిడి.  


 ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ క్రేజ్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ ‘కేజీయఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండంతో ‘సలార్’ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశం హద్దు అనే లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా  పూర్తి యాక్షన్ ఎంటర్‌‍టైనర్‌ రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట ఈ క్రేజీ డైరెక్టర్. ఈ క్రమంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్  ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దాంతో రిలీజ్ రోజు ఓపినింగ్స్ అదిరిపోతాయి. మరి ఈ సినిమాకు ఎంత బిజినెస్ అయ్యింది.. ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో చూస్తే...

తెలుగు థియేట్రికల్ హక్కులను దాదాపు ₹175 కోట్లకు అమ్మినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తమ పెట్టుబడులను మామూలు లాభాలతో తిరిగి పొందేలా చూసుకోవడానికి ఈ చిత్రం ఫుల్ రన్‌లో దాదాపు ₹300 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అదే వరల్డ్ వైడ్ అయితే మొత్తం 400 కోట్ల షేర్ రావాలని చెప్తున్నారు.  అంటే దాదాపు 770 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుంది.  సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే కష్టమేమీ కాదు, డిసెంబర్ నెలాఖరకు రికవరీ అయ్యిపోవచ్చు  అంటున్నారు. ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో చేసారని వినికిడి.

గతంలో ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం ₹115 కోట్లకు తెలుగు రాష్ట్రాల్లో అమ్మారు. ఈ సినిమా  ₹120-130+ కోట్ల గ్రాస్ వచ్చిందని (75+ కోట్ల షేర్ ) ఫుల్ రన్ లో వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం.  ఫ్లాఫ్ టాక్ కే  75+ కోట్ల షేర్ వస్తే...ఇంక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోమంటున్నారు.  ఇది దృష్టిలో పెట్టుకునే డిస్ట్రిబ్యూటర్స్ తమ రేట్లను ఫైనల్ చేసుకున్నారు.
   
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. స‌లార్ మూవీలో యాక్ష‌న్ సీన్స్‌తో పాటు వ‌యోలెన్స్ ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఏ సర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అలాగే సలార్ ర‌న్‌టైం 2 గంట‌ల 55 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌లార్ ట్రైల‌ర్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో మేక‌ర్స్ స‌లార్ నుంచి రెండో ట్రైల‌ర్ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  

 ‘సలార్‌’ పాన్‌ ఇండియా రికార్డులను తిరిగిరాయడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్‌’ది మొదటిస్థానం అని చెప్పాలి. టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ కాగానే ఓ రేంజిలో బుక్కింగ్స్ జరుగుతున్నాయి. 

సలార్, వరద రాజ మన్నార్‌ స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్.. ‘సలార్ పార్ట్ 1: సీజ్‍‍ఫైర్’ సినిమాను ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేశారు.  ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ  హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌