
చాలా కాలం అవుతుది ప్రభాస్ సినిమాల నుంచి అప్ డేట్స్ కనిపించక. రాధేశ్యామ్ ఫెయిల్యూర్ అప్పటి నుంచి రెట్టింపు జాగ్రత్తతో పనిచేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇక అప్పటి నుంచి ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఆదిపురుష్ నుంచి వచ్చిన అప్ డేట్ కాస్త నిరాశపరిచింది. ఇక అందరి దృష్టి సలార్ సినిమాపై పడింది. ఈమూవీ నుంచి అయినా మంచి అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్‌ల తరువాత కూడా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసి.. మరో మూడు సినిమాలు లైన్ ఎక్కించాడు ప్రభాస్. అందులో ఆదిపురుష్, సలార్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా.. మరో స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాల అప్ డేట్స్ కాస్త సీక్రేట్ గా ఉంచారు. నాగాశ్విన్ మూవీ చిన్నగా షూటింగ్ జరుగుతోంది ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలర్ మాత్రం శరవేగంగా పనులు జరుపుకుంటుంది.
కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈసినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అయితే ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కాకమేందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆతరువాత మళ్ళీ మూవీ నుంచి ఎటువంటి అప్ డేట్ ను రిలీజ్ చేయలేదు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. మేకర్స్ అసహనం వ్యాక్తం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులకు సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేశారట సలార్ నిర్మాతలు.
సలర్ నుంచి ఈ సంక్రాంతికి ఓ అప్ డేట్ వచ్చేలా పనిచేస్తున్నారట టీమ్. అయితే సాధ్యాసాద్యాలపై క్లారిటీ తీసకుని.. త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. సలార్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని.. ఇంకా కాస్త షూటింగ్ మిగిలి ఉందన్నారు. వీఎఫ్‌ఎక్స్‌కు 6నెలల సమయం కేటాయించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాను ఎలాగైనా.. అనుకున్న సమయానికి అంటే సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఇక ఇప్పటికే సినిమా రషెస్ చూశానని.. ప్రభాస్, పృథ్విరాజ్ సూపర్‌గా నటించారని పేర్కొన్నాడు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపాడు.
ఇక సంక్రాంతికి ప్రభాస్ నుంచి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది అనడంత్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతునర్నారు. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్‌కు జతగా.. కోలీవుడ్ స్టార్ బ్యూటీ శృతిహాసన్ నటిస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్ , జగపతి బాబు విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. కెజియఫ్ నిర్మించిన హోంబలే సంస్థ ఈ సినమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఈమూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.