ప్రభాస్ సలార్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకుంది. అదే విషయాన్ని రీసెంట్ గా సంక్రాంతి రోజు పోస్టర్ వేసి మరీ ప్రకటించారు.
డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘సలార్’.‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంలో ఓపినింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. తర్వాత కూడా సంక్రాంతి సినిమాలు వచ్చేదాకా బాగా ఆడింది. అయితే థియేటర్ లో చూడని చాలా మంది ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికికు ఓటిటిలో వస్తుందనుకుంటే రాలేదు. ఈ నేఫధ్యంలో తాజగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది. అదే డేట్ ని అఫీషియల్ గా ప్రకటించే అవకాసం ఉందని తెలిస్తోంది. ఇంతకీ ఆ డేట్ ఏమిటంటే..
సలార్ సూపర్ హిట్ అవడంతో ప్రభాస్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే రెండుసార్లు సక్సెస్ పార్టీ చేసుకున్నారు. రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన పార్టీకి ప్రభాస్ , ప్రశాంత్ నీల్, శృతి హాసన్ మరియు నిర్మాతలు టాలీవుడ్ హీరో అఖిల్ లాంటి స్టార్స్ హాజరయ్యారు. దాంతో సలార్ మూవీ ఓటిటి రిలీజ్ పై ఓ క్రేజీ న్యూస్ బయిటకు వచ్చింది. ఈ రాత్రి నుంచే ఈ సినిమా ఓటిటి లో రాబోతోందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేం లేదని కొందరు అంటున్నారు.
ప్రభాస్ సలార్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకుంది. అదే విషయాన్ని రీసెంట్ గా సంక్రాంతి రోజు పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ చెయ్యాలని మేకర్స్ ఒప్పందం చేసుకున్నారట. ఇక ఆ లెక్క ప్రకారం సలార్ మూవీ ఫిబ్రవరి 4 న కానీ, ఫిబ్రవరి 9 న కానీ ఓటిటి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటున్నారు. అయితే మరో వార్త ఏమిటంటే జనవరి 20న సలార్ నెట్ ప్లిక్స్ లో డబ్బులు పెట్టి చూసేలాగ పెడతారు అని పిభ్రవరి నుంచి రెగ్యులర్ గా ఇస్తారని అంటున్నారు. ఏది నిజమో అఫీషియల్ గా న్యూస్ వస్తే కానీ తెలియదు.
ఇక ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ చూసి రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ఎప్పుడూ అని అడుగుతున్నారు. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా. కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కాదు ...హిందీ, కన్నడ, మళయాళ,తమిళ మార్కెట్ లలో కూడా అక్కడ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి భారీగా రిలీజ్ అయ్యింది.