'సాహో': షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్!

Published : Mar 08, 2019, 01:05 PM IST
'సాహో': షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్!

సారాంశం

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. 

ఈ సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ప్రీరిలీజ్  బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు మొత్తం భారీ రేటిచ్చి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రూ.42 కోట్లు చెల్లించి మరీ ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.  

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?