సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!

Published : Aug 18, 2019, 08:09 PM IST
సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహోపై అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి.   

ప్రీరిలీజ్ ఈవెంట్ లో  సాహో చిత్రంలో కీలక పాత్ర పోషించిన అరుణ్ విజయ్ ప్రసంగించారు. అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. ఫైనల్ గా మీ అందరి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. సాహో చిత్రం ఆగష్టు 30న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు సుజిత్ కి నా ధన్యవాదాలు. ప్రభాస్ సర్ నన్ను ప్రత్యేకంగా అడిగారు. ఈ పాత్ర నువ్వు చేస్తే చాలా బావుంటుందని కోరారు. ఆయన పాన్ ఇండియా స్టార్. సాహో చిత్రంలో అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. 

నేను నటిస్తున్న మొదటి బహుభాషా చిత్రం ఇదే. తమిళంలో కూడా ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాహో అక్కడ కూడా భారీ విజయం సాధిస్తుంది. బాహుబలిలో ప్రభాస్ నటన చూశాం. సాహోలో మీరంతా సరికొత్త ప్రభాస్ ని చూస్తారు. అదరగొట్టిపడేశాడు. నా పాత్ర పేరు మనోజ్ విశ్వాంక్ అని అరుణ్ విజయ్ తన ప్రసంగంలో తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు