విక్రమ్‌ ఆదిత్య కమింగ్‌.. ప్రభాస్‌ రెట్రో లుక్‌ అమేజింగ్‌!

Published : Oct 21, 2020, 11:54 AM IST
విక్రమ్‌ ఆదిత్య కమింగ్‌.. ప్రభాస్‌ రెట్రో లుక్‌ అమేజింగ్‌!

సారాంశం

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదలైంది.

ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదలైంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ప్రభాస్‌ రెట్రోలుక్‌ని విడుదల చేశారు. ఈ నెల 23న ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ లుక్ ని విడుదల చేయగా, దీనికి విశేష స్పందన లభిస్తుంది. 

ఇప్పటికే ప్రభాస్‌ బర్త్ డే సీడీపీ విడుదల చేయగా, అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. తాజా `రాధేశ్యామ్‌`లోని ఆయన సోలో లుక్‌ సైతం ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ప్రభాస్‌ `విక్రమ్‌ ఆదిత్యగా కనిపించబోతున్నారు. ఇప్పటికే హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్రని విడుదల చేయగా, అందులో పూజా ప్రేరణ అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపారు. 

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు