Prabhas: రాధే శ్యామ్ మూవీ రన్ టైం... ఆర్ ఆర్ ఆర్ కంటే చాలా తక్కువ?

Published : Feb 06, 2022, 07:45 PM ISTUpdated : Feb 06, 2022, 07:46 PM IST
Prabhas: రాధే శ్యామ్ మూవీ రన్ టైం... ఆర్ ఆర్ ఆర్ కంటే చాలా తక్కువ?

సారాంశం

మరో నెలరోజుల్లో రాధే శ్యామ్ విడుదల కానుంది . ఈ నేపథ్యంలో మూవీ రన్ టైం గురించిన ఆసక్తికర సమాచారం. బయటికి వచ్చింది.

టాలీవుడ్ బడా చిత్రాలు ఆర్ ఆర్ ఆర్(RRR Movie), రాధే శ్యామ్ విడుదలకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు సెట్స్ పైకెళ్లిన రాధే శ్యామ్ షూటింగ్ దశలోనే చాలా ఆలస్యమైంది. తీరా విడుదల చేసే సమయానికి కరోనా మహమ్మారి వచ్చి పడింది సంక్రాంతి బరిలో దిగాల్సి రాధే శ్యామ్...  సమ్మర్ కి వాయిదా పడింది.  మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. కాగా ఇప్పటికే రాధే శ్యామ్ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ మావోయి రన్ టైం గురించి ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది. 

రాధే శ్యామ్(Radhe shyam movie) హిందీ వర్షన్ రన్ టైం కేవలం 2:30 నిమిషాలని వినికిడి. ఓ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం నిడివి రెండున్నర గంటలంటే చాలా తక్కువని అర్థం. ఈ మధ్య టూ టైర్ హీరోల చిత్రాలు కూడా దాదాపు మూడు గంటల రన్ టైం కలిగి ఉంటున్నాయి. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ మూవీ నిడివి మూడు గంటలని సమాహారం. ఆర్ ఆర్ ఆర్ తో పోల్చుకుంటే అరగంట తక్కువ నిడివి రాధే శ్యామ్ కలిగి ఉంది. 

దర్శకుడు ఈ కథను షార్ట్ అండ్ స్వీట్ గా ముగించనున్నారేమో చూడాలి. రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల తర్వాత మూవీ కథపై ఓ అవగాహన వచ్చింది. ప్రభాస్ మనుషుల జాతకాలు చెప్పే హస్తసాముద్రికుడిగా కనిపిస్తున్నారు. ఇక విధికి ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణగా రాధే శ్యామ్ చిత్రం ఉండనుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ప్రభాస్ చివరి చిత్రం సాహో విడుదలై రెండేళ్లు దాటిపోయింది. 2019లో సాహో విడుదల కాగా తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో రాధే శ్యామ్ చిత్రంపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఈ చిత్రంతో రికార్డ్స్ తిరగరాయనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం