తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ సినిమా టైటిల్‌ ఇదేనా? ప్రభాస్‌ని విలన్‌గా చూపించబోతున్నారా?

Aithagoni Raju | Published : Mar 10, 2025 12:45 PM

Prabhas-prasanth varma movie : ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో ఇటీవల టెస్ట్ షూట్ జరిగింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ లీక్‌ అయ్యింది. క్రేజీగా ఉంది. ప్రభాస్‌ పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తుంది.   

Prabhas-prasanth varma movie : ప్రభాస్‌ సినిమాల లైనప్‌ రోజు రోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం వినిపించే చర్చల్లో ఉన్న సినిమాలే ఏకంగా ఏడు ఉన్నాయి. మరో మూవీ కమిట్‌మెంట్‌ ఉంది. సుమారు ఎనిమిది సినిమాలు చేయాల్సి ఉంది.

అంటే దాదాపు నాలుగేళ్లు ప్రభాస్‌ ఫుల్‌ బిజీ. 2029 వరకు ఆయన తీరిక లేకుండా ఉంటారు. మరో నాలుగేళ్లు ప్రభాస్‌ని ఎవరూ టచ్‌ చేయలేని పరిస్థితి. చేస్తున్న మూవీస్‌ అన్నీ పాన్‌ ఇండియా చిత్రాలే. ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ వైడ్‌గా రచ్చ చేయగలిగే సినిమాలే. 

ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ లో సినిమా 

ప్రభాస్‌ రీసెంట్‌గానే ప్రశాంత్‌ వర్మతో సినిమాకి కమిట్‌ అయిన విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. మైథలాజికల్‌ టచ్‌ ఉన్న చిత్రమిది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టెస్ట్ షూట్‌ చేశారు. భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ టెస్ట్ షూట్‌లో పాల్గొందట.

అయితే ఈమూవీని మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్‌ వర్మ. మహాభారతంలోని బకాసురుడు పాత్రని ప్రధానంగా చేసుకుని రూపొందిస్తున్నారట. బకాసురుడు రాక్షసుడు. మరి ఆయన కథతో ఎలాంటి సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

read more: 'రాజాసాబ్': ఫైనాన్సియల్ సమస్యలతో షూటింగ్ ఆపారా?

ప్రభాస్, ప్రశాంత్‌ వర్మ మూవీ టైటిల్‌ `బక`..

ఇందులో ప్రభాస్‌ బకాసురుడు తరహాలో కనిపిస్తాడా అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ వార్త లీక్ అయ్యింది. బకాసురుడు పాత్ర ఆధారంగా తెరకెక్కే మూవీ కావడంతో దీనికి `బక` అనే పేరును అనుకుంటున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రభాస్‌ పాత్రకి సంబంధించే ఇప్పుడు ఫ్యాన్స్ ని సరికొత్త డౌట్‌ వెంటాడుతుంది. ఇందులో ఆయనది నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రనా అనే అనుమానం ఇస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ ఏం చేయబోతున్నారో చూడాలి. 

ప్రభాస్‌ సినిమాల లైనప్‌

ప్రభాస్‌ ఇప్పుడు `ది రాజా సాబ్‌` మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా మరో 10 శాతం షూటింగ్‌, మూడు పాటలు బ్యాలెన్స్ ఉందట. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈఏడాది విడుదల కాబోతుంది. ఆ తర్వాత `స్పిరిట్‌`లో పాల్గొంటాడు ప్రభాస్‌.

అనంతరం ప్రశాంత్‌ వర్మ మూవీ ఉండబోతుందట. `సలార్‌2`, `కల్కి 2` కంటే ముందేఈ చిత్రం తెరకెక్కనుందట. అనంతరం `సలార్‌ 2`, `కల్కి 2` ఉంటుంది. వీటితోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మరో సినిమాని దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇది కూడా మైథలాజికల్‌ టచ్‌ ఉన్న సినిమా అని తెలుస్తుంది. 

read  more: రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?

also read: రాజశేఖర్‌ నో చెప్పిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏంటో తెలుసా? రెండు సార్లు సేమ్‌
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!