Prabhas: 8.2 కోట్ల మంది చూసినా ఓటీటీ సర్వర్‌ క్రాష్ కాలేదు.. ప్రభాస్ టీమ్‌ని ఆడుకుంటున్న ట్రోలర్స్

Published : Mar 13, 2026, 01:51 PM IST
t20 world cup, prabhas

సారాంశం

Prabhas: 'ది రాజాసాబ్' ఓటీటీ రిలీజ్ కోసం జియో హాట్‌స్టార్ తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిందంటూ గతంలో ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడదే ప్రభాస్ పీఆర్ టీమ్‌ను విమర్శలపాలు చేస్తోంది.

ప్రభాస్‌ టీమ్‌పై విమర్శలు 

ఒక సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడానికి ఒకప్పుడు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడిందనేది లెక్క. ఆ తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయి. టీవీలో సినిమా వేసినప్పుడు వచ్చిన రేటింగ్స్‌ను కూడా అభిమానులు పెద్ద లెక్కగా చూసేవాళ్లు. ఇప్పుడు ఓటీటీ వచ్చాక, అక్కడ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది కూడా పాపులారిటీకి కొలమానంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓటీటీ ప్రచారం విషయంలోనే పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ టీమ్‌ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన 'ది రాజాసాబ్' సినిమా ఓటీటీ రిలీజ్ టైంలో జరిగిన ఓ ప్రచారమే దీనికి కారణం.

`ది రాజాసాబ్‌` ఓటీటీలోకి వచ్చినప్పుడు సర్వర్లు క్రాష్‌

జనవరి 9న థియేటర్లలో రిలీజైన `ది రాజాసాబ్‌` సినిమా, ఫిబ్రవరి 6న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే, ఓటీటీ రిలీజ్‌కు ముందే ఈ సినిమా కోసం హాట్‌స్టార్‌లో విపరీతమైన ట్రాఫిక్ వస్తోందని, 'రిమైండ్ మీ' బటన్ క్లిక్ చేయడానికి జనం ఎగబడుతున్నారని కొన్ని రిపోర్టులు వచ్చాయి. సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, జియో హాట్‌స్టార్ తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిందని కూడా ప్రచారం చేశారు. అయితే, ఇదంతా ప్రభాస్ పీఆర్ టీమ్ సృష్టించిన ప్రచారమేనని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ విషయం మళ్లీ తెరపైకి రావడానికి కారణం టీ20 వరల్డ్ కప్.

టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌కి 8.2కోట్ల వ్యూస్‌ 

ఇటీవల జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను హాట్‌స్టార్‌లో ఏకంగా 8.2 కోట్ల మంది చూశారని ఆ ప్లాట్‌ఫామే అధికారికంగా ప్రకటించింది. ఇంతమంది ఒకేసారి చూసినా ఎలాంటి సమస్య రాని సర్వర్‌ను, ఓ  సినిమా కోసం అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏముందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు 'సలార్' మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది.  `ది రాజాసాబ్‌` పరాజయానికి సంబంధించి దృష్టి మళ్లించడానికే ఆయన టీమ్ ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ట్రోలర్స్ కామెంట్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

రాధిక శరత్ కుమార్ కు జాక్‌పాట్.. లాభాల్లో వాటా అందుకున్న తొలి నటిగా రికార్డ్
Varalaxmi Sarathkumar: డబ్బుల్లేకపోతే పిల్లల్ని కనడం ఎందుకు.. దుమారం రేపుతున్న వరలక్ష్మి కామెంట్స్