ప్రభాస్ ‘సలార్’ టీజర్ విడుదల తేదీ ఫిక్స్.!!?

Published : Jun 19, 2023, 10:43 AM IST
ప్రభాస్ ‘సలార్’ టీజర్ విడుదల తేదీ ఫిక్స్.!!?

సారాంశం

సెప్టెంబర్ 28న 'సలార్' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' మొన్న శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితేనేం కలెక్షన్స్ కుమ్మేస్తోంది. కానీ ఫ్యాన్స్ కు ఈ సినిమాపై నెగిటివిటి విసుగెత్తిస్తోంది. అంతేకాదు తాము ఎలాగైతే ప్రభాస్ ని చూడాలనుకున్నారో ఆ ప్రభాస్ ఈ సినిమాలో కనపడలేదు. దాంతో ఇప్పుడు వారంతా  'సలార్' (Salaar Movie)వైపు తమ దృష్టిని మరల్చారు.
 
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడ ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోచ్చిందని తెలుస్తోంది.ఈ నేపధ్యంలో  ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడొస్తుందా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఆదిపురుష్ చిత్రంతో పాటు సలార్ టీజర్ ని వదులుతారు అనుకున్నారు కానీ ఆదిపురుష్ టైమ్ లో సలార్ గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదు అని ప్రభాస్ క్లియర్ చెప్పి వద్దన్నారు అని సమాచారం.


  
ఈ క్రమంలో ప్రభాస్ సలార్ ఫస్ట్ లుక్ అలాగే టీజర్ ని ఆగస్ట్ 15 న విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి సినిమా ప్రమోషన్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయటం జరిగిందని సమాచారం.   అయితే దీనిపై సలార్ టీం నుండి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. 

ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, భువన గౌడ కీలకమైన పాత్రలో చేస్తున్నారు అలాగే అత్యంత భారీ బడ్జెట్ తో హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ సినిమాని తెర కెక్కిస్తున్నారు. సలార్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.   ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా