
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ప్రభాస్ మరో సినిమాను ప్రారంభించబోతున్నాడు. 'జిల్' ఫేం దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి షెడ్యుల్ ని ఇటలీలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఇటలీకి చేరుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనునుంది.