`ది రాజా సాబ్‌`.. ప్రభాస్‌, మారుతి సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్‌ వచ్చింది.. ఎలా ఉందంటే?

Published : Jan 15, 2024, 07:28 AM ISTUpdated : Jan 15, 2024, 07:33 AM IST
`ది రాజా సాబ్‌`.. ప్రభాస్‌, మారుతి సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్‌ వచ్చింది.. ఎలా ఉందంటే?

సారాంశం

ప్రభాస్‌ సినిమా నుంచి సంక్రాంతి సర్‌ప్రైజ్‌ వచ్చింది. మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ టైటిల్‌ ఫస్ట్  లుక్‌ని విడుదల  చేశారు. వింటేజ్‌ ప్రభాస్‌ రచ్చ  చేస్తున్నాడు.

డార్లింగ్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కొత్త సినిమా సంక్రాంతి  ట్రీట్‌ వచ్చింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ కి  సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చారు. సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని సోమవారం ఉదయం విడుదల చేశారు. `ది రాజా సాబ్‌`(The RaajaSaab) అనే టైటిల్‌ నిర్ణయిస్తూ అదిరిపోయే ఫస్ట్ లుక్‌ని ఇచ్చారు. ఇందులో ప్రభాస్‌ ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నారు.  సంక్రాంతి సందడి తీసుకొచ్చినట్టుగా  ఆయన  ఫస్ట్ లుక్‌ ఉండటం విశేషం. 

ఇందులో ప్రభాస్‌ లుంగీ పైకి ఎత్తి డాన్సు  చేస్తున్నాడు. బ్లాక్‌ షర్ట్ ధరించాడు. లుక్‌ కూడా కొత్తగా ఉంది. అలాగే యంగ్‌గా ఉన్నాడు.ఓ పదేళ్ల క్రితం ప్రభాస్‌ని తలపిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. హర్రర్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ,  ఫైట్లు ఉండబోతున్నాయట. అయితే అన్నింటిలోనూ ఫన్‌ మెయిన్‌గా ఉంటుందని తెలుస్తుంది. మారుతి మార్క్ కమర్షియల్‌ మూవీ అంటున్నారు. ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉండబోతుందట. 

చాలా గ్యాప్‌ తర్వాత  ప్రభాస్‌ ఇలాంటి ఒక ఫ్యామిలీ మూవీ చేస్తున్నారు. ఇందులో ఆయన కామెడీ కూడా చేస్తాడట. ఫస్ట్ లుక్‌  చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఇక మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని తెరకెక్కిస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే ఈ మూవీకి `రాజా డీలక్స్`  అనే పేరు వినిపించింది. దానిలో కొంచెం మార్పులు  చేసి `ది రాజా సాబ్‌`  చేసినట్టు తెలుస్తుంది. కానీ వింటేజ్‌ ప్రభాస్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?