`కల్కి 2898 ఏడీ` ఇంకా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదా?.. ఆ రూమర్లు నిజమేనా?

Published : Jul 19, 2024, 01:37 PM IST
`కల్కి 2898 ఏడీ` ఇంకా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదా?.. ఆ రూమర్లు నిజమేనా?

సారాంశం

ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటికే వెయ్యి కోట్లు దాటింది. కానీ అక్కడ మాత్రం ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కూడా కాలేదట.   

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా చాలా చోట్ల గత పాత రికార్డులన్నింటిని బ్రేక్‌ చేస్తుంది. ఓవర్సీస్‌లో `జవాన్‌` రికార్డులు బ్రేక్‌ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన నాన్‌ `బాహుబలి 2` మూవీగా నిలిచింది. మరోవైపు హిందీలోనూ దుమ్మురేపుతుంది. సుమారు మూడు వందల కోట్లకు దగ్గరలో ఉంది. ఓవర్సీస్‌లో 250కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది 277కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ వెయ్యి కోట్లు దాటింది. ఈలెక్కన సుమారు 507కోట్ల షేర్‌ సాధించింది. 

ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ముందస్తు థియేటర్‌ వ్యాపారం జరిగింది. ప్రస్తుతం లెక్కల ప్రకారం 135కోట్ల లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగులో ఈ సినిమా 168కోట్ల బిజినెస్ చేసింది. 65 నైజాం, 101 ఏపీలో వ్యాపారం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ 277కోట్ల కలెక్షన్లని రాబట్టింది. నెట్‌ 170కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ లెక్కన చూస్తే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. కానీ ఏరియాల వైజ్‌గా చూస్తే ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌ కాలేదట. సిటీ, అర్భన్‌ ఏరియాల్లో సినిమాకి జనం బ్రహ్మరథం పట్టారు. కానీ రూరల్‌ ఏరియాల్లో మాత్రం, అదే సమయంలో సింగిల్‌ థియేటర్లున్న చాలా చోట్ల ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కాలేదట. ప్రపంచం అంతా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటున్నారు, కానీ మాకు ఇంకా డబ్బులు రాలేదని కొందరు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

నిజానికి `కల్కి` ఏ, బీ సెంటర్లలో ఆడే సినిమా. సీ సెంటర్‌ ఆడియెన్స్ కి అంతగా ఎక్కదు. చూసేందుకు ఆసక్తి కూడా చూపించరు. ఈ సినిమా విషయంలో పెద్ద మైనస్‌ బీ సెంటర్ల విషయంలో జరిగిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. అలా కొందరు బయ్యర్లు ఇంకా కొన్న డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారట. అయితే ఇప్పట్లో పెద్ద సినిమాలేవి లేవు. మరో నెల రోజులపాటు సినిమాకి తిరుగులేదు. అప్పటి వరకు అయినా బ్రేక్‌ ఈవెన్ అవుతుందా? అనేది చూడాలి. అదే సమయంలో కొందరు దీనిపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ క్రిటిక్స్ సినిమా ఫేక్‌ కలెక్షన్లు అంటూ ప్రచారం చేస్తున్నారని, దీనిపై `కల్కి` టీమ్‌ యాక్షన్‌ తీసుకుందని, 25కోట్ల పరువునష్టం దావా వేసినట్టు తెలుస్తుంది. 

నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898 ఏడీ`లో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వెయ్యి కోట్ల కలెక్షన్లని దాటి ఇంకా విజయవంతంగా రన్‌ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌కి మహాభారతం ఎలిమెంట్లు జోడించి నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్‌ వెండితెరపై వర్కౌట్‌ అయి, ఈ స్థాయి విజయాన్ని సాధించింది. ఇక రెండో పార్ట్ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని తాజాగా నిర్మాత అశ్వినీదత్‌ చెప్పిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్