మాకు థియేటర్లే గుడులు.. ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా అంటూ సెంటిమెంట్‌తో కొట్టిన ప్రభాస్‌

By Aithagoni RajuFirst Published Aug 3, 2022, 10:10 PM IST
Highlights

 ప్రభాస్‌ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలని, అలాంటి చిత్రమే `సీతారామం` అని చెప్పారు. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలన్నారు. 

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) థియేటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లని ఆయన గుడులతో పోల్చడం విశేషం. ఇంట్లో దేవుడు ఉన్నాడని చెప్పి గుడికి వెళ్లడం మానేస్తామా? అంటూ వ్యాఖ్యానించారు. ప్రభాస్‌ తాజాగా `సీతారామం`(Sita ramam) చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్‌లోకి ఆయన గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీనే అదిరిపోయేలా ఉండటం విశేషం. ఈవెంట్‌కే హైలైట్ గా నిలిచింది. 

ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలని, అలాంటి చిత్రమే `సీతారామం` అని చెప్పారు. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలన్నారు. ఈ సందర్భంగానే ఆయన థియేటర్లని గుడులుగా పోల్చారు. `మా సినిమా ఇండస్ట్రీకి థియేటర్లు గుడులు లాంటివి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మానేస్తామా, ఇదీ అంతే. తప్పకుండా సినిమాని థియేటర్లలోనే చూడండి` అని చెప్పారు ప్రభాస్‌. 

`ఇంతఖర్చుపెట్టి, ఇలాంటి లవ్‌ స్టోరీ సినిమా చేయడం ఈజీ కాదు. ఇందులో యుద్ధం కూడా ఉంది. కాశ్మీర్‌తోపాటు రష్యాలో షూట్‌ చేశారు. రష్యాలో చిత్రీకరించిన తొలి చిత్రమిదే అనుకుంటా. దర్శకుడు హను చాలా బాగా తెరకెక్కించారు. ఆయన టేకింగ్‌ అద్భుతంగా ఉంది. దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతమైన యాక్షన్‌. ఇండియా వైడ్‌గా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉంది. `మహానటి`తో అదరగొట్టారు. ఫోటోగ్రఫీ పోయెట్రిలా ఉంది. గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్‌ దత్‌ గారు ఈ సినిమా వెనకాలు ఉన్నారు. ఆయన యాభై ఏళ్లుగా తెలుగులో ఉండటం మా అదృష్టం` అని చెప్పారు ప్రభాస్. 

ఈ సందర్బంగా నిర్మాత స్వప్నా దత్‌ మాట్లాడుతూ, ప్రభాస్‌ సాధారణంగా బయటకు రారు. ఇప్పుడు మా కోసం వచ్చారు. మా సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్‌కి రప్పించడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. మరోవైపు దర్శకుడు, దుల్కర్‌ సల్మాన్‌, ఇలా అంతా ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినిమాని థియేటర్లలోనే చూడాలని కోరుకున్నారు. ఈసందర్భంగా సినిమాకి సంబంధించిన బిగ్‌ టికెట్‌ని ప్రభాస్‌ లాంచ్‌ చేశారు. మొదటి టికెట్‌ని ఆయన కొనడం ఓ విశేషమైతే, ఆ మనీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వద్ద తీసుకున్నానని ప్రభాస్ చెప్పడం మరో విశేషం. 

click me!