మాయ చేస్తున్న ప్రభాస్‌ హోం బ్యానర్‌లోని `ఏక్‌మినీ కథ`

Published : Mar 18, 2021, 07:42 PM IST
మాయ చేస్తున్న ప్రభాస్‌ హోం బ్యానర్‌లోని `ఏక్‌మినీ కథ`

సారాంశం

ప్రభాస్‌ హోం బ్యానర్‌ యూవీ క్రియేషన్స్  భారీ సినిమాలనే కాదు, డిఫరెంట్స్ స్టోరీస్‌ని, కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించబోతుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు పారలల్‌గా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంది. కంటెంట్‌ ఉన్న డైరెక్టర్లు, ఆర్టిస్టులకు లైఫ్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌ చేపట్టింది. 

ప్రభాస్‌ హోం బ్యానర్‌ యూవీ క్రియేషన్స్  భారీ సినిమాలనే కాదు, డిఫరెంట్స్ స్టోరీస్‌ని, కాన్సెప్ట్ చిత్రాలను రూపొందించబోతుంది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు పారలల్‌గా చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంది. కంటెంట్‌ ఉన్న డైరెక్టర్లు, ఆర్టిస్టులకు లైఫ్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌ చేపట్టింది. అందుకోసం యూనీ కాన్సెప్ట్స్ పేరుతో ఓ బ్యానర్‌ని స్థాపించింది. ఇందులో `ఏక్‌ మినీ కథ` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తుంది. `డోస్‌ సైజ్‌ మ్యాటర్‌` అనేది మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. `పేపర్‌బాయ్‌`తో ఆకట్టుకున్న సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. 

ఈ సినిమాకి `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌`, `ఎక్స్ ప్రెస్‌ రాజా` వంటి సినిమాలను రూపొందించిన మేర్లపాక గాంధీ కథ అందించడం మరో విశేషం. కార్తీక్‌ రాపోలు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇందులోని ఓ పాటని విడుదల చేశారు. `ఈ మాయలో..`అంటే సాగే పాటని విడుదల చేయగా అది శ్రోతలను మెప్పిస్తుంది. ఆకర్షిస్తుంది. ప్రవీణ్‌ లక్కరాజు సాహిత్యంతోపాటు సంగీతం అందించారు.  రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదలకు సిద్ధమవుతుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా