విరాటపర్వంలో సాయి పల్లవి నోట కొత్త తిట్టు: దాని నేపథ్యం ఇదీ...

By telugu teamFirst Published Mar 18, 2021, 6:03 PM IST
Highlights

వేణు ఉడగుల రాసి, దర్శకత్వం వహించిన విరాటపర్వం సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ టీజర్ చివరలో వెన్నెల (సాయి పల్లవి) ఓ కొత్త తిట్టును ప్రయోగించింది. దాని నేపథ్యమేమిటో చూద్దాం.

హైదరాబాద్: వేణు ఉడుగుల రాసి దర్శకత్వం వహించిన విరాటపర్వం సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గురువారం సాయంత్రం విడుదల చేశారు. టీజర్ చాలా సాంద్రంగానూ, ఆసక్తికరంగానూ ఉంది. అయితే, టీజర్ చివరలో వెన్నెల (సాయి పల్లవి) రాళ్లు విసురుతూ ఓ తిట్టు పదాన్ని ప్రయోగించింది. అది ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వాడిన దాఖలాలు లేవు.

వెన్నెల రాళ్లు విసురుతూ దొంగ లంజడి కొడుకా అని తిడుతుంది. మనకు ఈ పదం పెద్దగా పరిచయం లేదు. కానీ జానపదుల్లో వాడుకలో ఉంది. అది పురుషుడిని ఉద్దేశించి ప్రయోగించిన తిట్టు. 1990ల్లో రచయిత వడ్డెర చండీదాస్ చీకట్లోంచి చీకట్లోకి అనే కథలో ఆ పదాన్ని వాడాడు.

Also Read: మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన `విరాటపర్వం` టీజర్‌.. చూస్తే గూస్‌బమ్సే

ప్రతిసారీ స్త్రీలను అవమానపరిచే తిట్లు మాత్రమే బహుళంగా ప్రజల ఉపయోగంలో కనిపిస్తుంటాయి. దొంగ లంజడి కొడుకా అనేది పురుషుడ్ని అవమానిస్తూ ప్రయోగించిన తిట్టు. దీన్ని ఎందుకు ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్)లోకి తీసుకురాకూడదని వడ్డెర చండీదాస్ అభిప్రాయపడ్డారు. అభిప్రాయాన్ని ప్రముఖ భాషా శాస్త్రవేత చేకూరి రామారావు (చేరా) సమర్థించారు. 

ఏమైనా, స్పష్టమైన దృక్పథంతో వేణు ఉడుగుల కథ రాసి తెలుగు సినిమా ప్రేక్షకులకు ఓ సినిమాను అందిస్తున్నారనేది అర్థమవుతోంది. విరాటపర్వం సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రియమణి కూడా ఓ ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

click me!