ఆసక్తి పెంచుతున్న ప్రభాస్, మారుతి చిత్రం.. రెండు పాత్రల్లో యంగ్ రెబల్ స్టార్ ?

Published : Oct 15, 2022, 01:31 PM IST
ఆసక్తి పెంచుతున్న ప్రభాస్, మారుతి చిత్రం.. రెండు పాత్రల్లో యంగ్ రెబల్ స్టార్ ?

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు, కమిటైన మూవీస్ కంప్లీట్ కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు, కమిటైన మూవీస్ కంప్లీట్ కావడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది. కానీ ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకునే దర్శకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు. 

తక్కువ టైం లో ఒక చిన్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కంప్లీట్ చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలో ఈ చిత్రం సెట్స్ కి వెళ్లనున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. 

మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ ఇంకా కంఫర్మ్ చేయలేదు. ఇక డైరెక్టర్ మారుతి ఈ చిత్రం కోసం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రెండు టైం పీరియడ్స్ లో జరుగుతుందట. ఇందులో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. మొదట మనవడి కథని నేరేట్ చేస్తూ.. ఫ్లాష్ బ్యాక్ లో గ్రాండ్ ఫాదర్ కథని చూపిస్తారట. ఓల్డ్ ఫార్ములానే అయినప్పటికీ మారుతి కథని పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

బాహుబలిలో తండ్రి కొడుకులుగా ప్రభాస్ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. కానీ ఇప్పుడు తతా మనవడిగా నటించబోతున్నాడు. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?