అఫీషియల్ గా బిగ్ షాక్.. 'ఆదిపురుష్' దాదాపు 6 నెలలు వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదిగో

By team teluguFirst Published Nov 7, 2022, 8:33 AM IST
Highlights

టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ప్రభాస్, ఓం రౌత్ , ఆదిపురుష్ టీం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నది వాస్తవం. ప్రభాస్ గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో ఆదిపురుష్ పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ప్రభాస్, ఓం రౌత్ , ఆదిపురుష్ టీం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నది వాస్తవం. ప్రభాస్ గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. దీనితో ఆదిపురుష్ పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. పైగా ఇది పౌరాణిక చిత్రం. తేడా జరిగితే ఎలా ఉంటుందో టీజర్ తోనే చూపించారు. 

ఈ పరిస్థితుల మధ్య ముందుగా అనుకున్నట్లుగా ఆదిపురుష్ సంక్రాంతికి రావడం లేదు అంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే నిజం అయింది. తాజాగా ప్రభాస్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆదిపురుష్ చిత్రం దాదాపు 6 నెలలు వాయిదా పడింది. వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

అఫీషియల్ అనౌన్స్ మెంట్ లో ఓం రౌత్ వ్యాఖ్యలు ఉన్నాయి. 'ఆదిపురుష్ కేవలం సినిమా మాత్రమే కాదు.. శ్రీరామ ప్రభువు, మన సంస్కృతి, చరిత్ర పట్ల మా కమిట్మెంట్ తెలియజేసే విధంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆడియన్స్ కి అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మాకు ఇంకొంత సమయం కావాలి. కాబట్టి ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16, 2023న రిలీజ్ చేయాలని నిర్ణయించాం. 

తప్పకుండా ఈ చిత్రాన్ని దేశం గర్వపడే విధంగా తీర్చిదిద్దుతాం. అభిమానుల ప్రేమ, సపోర్ట్ తో మరింత కమిట్మెంట్ తో వర్క్ చేస్తాం' అంటూ దర్శకుడు ఓం రౌత్ ప్రకటనతో పేర్కొన్నారు. ప్రభాస్ ని శ్రీరాముడిగా ఈ సంక్రాంతికి చూడాలనుకున్న ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశే. అయితే టీజర్ లో కనిపించిన లోపాలు సరిచేసుకునేందుకు చిత్ర యూనిట్ కి ఇది మంచి ఛాన్స్. 

click me!