Prabhas: పూజా హెగ్డే ఊసే ఎత్తని ప్రభాస్.. తన పాత హీరోయిన్ గురించి మాత్రం..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 11, 2022, 08:20 AM IST
Prabhas: పూజా హెగ్డే ఊసే ఎత్తని ప్రభాస్.. తన పాత హీరోయిన్ గురించి మాత్రం..

సారాంశం

రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పూజా హెగ్డే గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ మరో హీరోయిన్ గురించి ప్రభాస్ మాట్లాడారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ తెల్లవారు జాము నుంచి థియేటర్స్ లో సందడి షురూ చేసింది. ఈ చిత్రం క్లాస్ గా, ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది అంటూ ప్రీమియర్ షోల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా అభిమానులు చెప్పుకుంటున్నారు. 

పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ అదిరింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి, ప్రభాస్ రాధే శ్యామ్ గురించి అనేక విశేషాలు మాట్లాడుకున్నారు. కానీ ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా పూజా హెగ్డే గురించి ప్రస్తావనే రాలేదు. 

ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రాదే శ్యామ్ ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్, పూజా ఇద్దరూ కెమెరా ముందు దగ్గరగా కనిపించినా.. ఎడమొహం పెడమొహం గా ఉన్నారని అందరికి అర్థం అయింది. రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అని.. ఆ క్రెడిట్ దర్శకుడు రాధాకృష్ణదే అని ప్రభాస్ చెప్పాడు. కానీ పూజా హెగ్డే గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యమే. 

కానీ తన పాత హీరోయిన్ కంగనా రనౌత్ గురించి మాత్రం ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. జాతకాలు, విధిరాత గురించి ప్రభాస్ రాజమౌళికి చెబుతూ.. కంగనా రనౌత్ సినిమాల్లోకి రాకముందు, అసలు నటి కావాలనే ఆలోచనే లేని సమయంలో జాతకం చూపించుకుంది. జ్యోతిష్యులు ఆమెతో నువ్వు హీరోయిన్ అవుతావని చెప్పారని.. ఈ విషయాన్ని కంగనా తనతో ఏక్ నిరంజన్ షూటింగ్ లో ఉన్నప్పుడు తెలిపిందని చెప్పాడు. 

ఎక్కడా పూజా హెగ్డే గురించి కానీ, ఆమె నటన గురించి కానీ ప్రభాస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనితో ఇద్దరి మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా