బాగా సన్నగా మారిన ప్రభాస్, గెటప్ కోసమే ఈ కష్టం

Surya Prakash   | Asianet News
Published : Nov 25, 2020, 04:46 PM IST
బాగా సన్నగా మారిన ప్రభాస్, గెటప్ కోసమే ఈ కష్టం

సారాంశం

ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ సలహాతో కొంతమంది పోషకాహార టీమ్ తో  కలిసి అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తున్నారట. అయితే ఈ ఎఫెక్ట్.. రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ లోనూ కనపడే అవకాసం ఉందిట. ఆ  షూట్ లో పాల్గొంటూనే స్లిమ్ గా మారిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరో ప్రక్క శ్రీరాముడులా..నీలి రంగులు అద్దుకున్న రూపంతో ప్రభాస్ అభిమానులకు ట్రీటివ్వబోతున్నాడని చెప్తున్నారు.   


ప్రభాస్ బాగా సన్నపడుతున్నారు. గతంలో బాహుబలి కోసం భారీగా మారిన ఆయన ఇప్పుడు ఆదిపురుష్ లో తన గెటప్ కోసం సన్నపడుతున్నారని సమాచారం. ఇక్కడ మీరు చూస్తున్న లుక్ అదే. డైరక్టర్ సూచన మేరకు శ్రీరాముడిలా సన్నగా కనిపించేందుకు రూపం మార్చుకుంటున్నారట. సన్నగా అంటే పూర్తిగా పై నుంచి క్రిందకు సన్నపడటం కాకుండా  భుజ బల సంపన్నుడిగానే కనిపిస్తూ శరీరాకృతిని పూర్తిగా సన్న పరుస్తాడట. ఇది కాస్త కష్టమైన ఫీటే. 

కానీ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ సలహాతో కొంతమంది పోషకాహార టీమ్ తో  కలిసి అందుకోసం ప్రత్యేకమైన డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తున్నారట. అయితే ఈ ఎఫెక్ట్.. రాధే శ్యామ్ లోని క్లైమాక్స్ లోనూ కనపడే అవకాసం ఉందిట. ఆ  షూట్ లో పాల్గొంటూనే స్లిమ్ గా మారిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరో ప్రక్క శ్రీరాముడులా..నీలి రంగులు అద్దుకున్న రూపంతో ప్రభాస్ అభిమానులకు ట్రీటివ్వబోతున్నాడని చెప్తున్నారు. 

ఇందులో హీరోయిన్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం జనవరి నుండి  షూటింగ్ కు వెళ్లనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణ్ పాత్రను పోషించనున్నారు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తయ్యాక అతను ఈ చిత్రానికి ప్రిపరేషన్ ప్రారంభిస్తాడు. ఆదిపురుష్ 2022 ఆగస్టు 11 న హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో విడుదల కానుంది. ఇది 3డి 2డి వెర్షన్లలో తెరకెక్కనుంది. ఆ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించింది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం