మారుతికు స్టార్ హీరో ఓకే చేసాడు..ఫుల్ జోష్

By Surya PrakashFirst Published Nov 25, 2020, 3:17 PM IST
Highlights

 
ఈ రోజుల్లో అనే సినిమా మారుతికు డైరక్టర్ గా కెరీర్  ఇస్తే..శైలజా రెడ్డి అనే సినిమా ఆయనకు గ్యాప్ తెచ్చేసింది. అయితే ఆ తర్వాత కసితో సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు.  మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా షూటింగ్ కరోనా వల్ల మొదలెట్టకపోయినా సినిమా ఎనౌన్సమెంట్ కూడా చేయలేదు. 


 ప్రతీ రోజు పండగే వంటి మంచి హిట్ సినిమా ఇచ్చినా దర్శకుడు మారుతి నెక్ట్స్ సినిమా ఇప్పటికీ మొదలుకాలేదు. ఆయన ఏ స్టార్ హీరోని కన్వీన్స్ చేయలేకపోయారు. దాదాపు సంవత్సరం పాటు అనేక మంది స్టార్స్ దగ్గరకు తిరిగి తిరిగి ఫైనల్ గా రవితేజ చేత ఓకే చేయించుకున్నారు. వరసగా నాలుగు ఫ్లాఫ్ లు ఇచ్చి నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రవితేజ..మారుతి కామెడీ టైమింగ్ ని నమ్మి,నచ్చి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు. 
 
ఈ రోజుల్లో అనే సినిమా మారుతికు డైరక్టర్ గా కెరీర్  ఇస్తే..శైలజా రెడ్డి అనే సినిమా ఆయనకు గ్యాప్ తెచ్చేసింది. అయితే ఆ తర్వాత కసితో సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు.  మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా షూటింగ్ కరోనా వల్ల మొదలెట్టకపోయినా సినిమా ఎనౌన్సమెంట్ కూడా చేయలేదు. 

ఇక మారుతి, రవితేజ కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేసి వినిపించిన్నట్లు తెలుస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాని మించి ఫన్ ఈ సినిమాలో ఉండబోతోందిట.   ప్రస్తుతం రవితేజ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 

click me!