ఎన్టీఆర్ నెంబర్ వన్.. ప్రభాస్ కామెంట్స్!

Published : Dec 24, 2018, 09:39 AM IST
ఎన్టీఆర్ నెంబర్ వన్.. ప్రభాస్ కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోలో రాజమౌళి, ప్రభాస్, రానాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరణ్ నుండి వారికి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా కరణ్.. ఎన్టీఆర్, మహేష్,చరణ్, బన్నీలలో ఆన్ స్క్రీన్ లో నటించే ప్రిఫరెన్స్ లో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారని ప్రభాస్ ని ప్రశ్నించాడు.

దానికి ప్రభాస్ వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పాడు. ఎన్టీఆర్ కి నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన ప్రభాస్ ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల పేర్లు చెప్పాడు. ఎన్టీఆర్, ప్రభాస్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. 

గతంలో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా చేయాల్సివస్తే ఎవరితో చేస్తారని ప్రశ్నించగా గోపీచంద్, తారక్ ల పేర్లు చెప్పాడు. ఇప్పుడు కూడా తారక్ పేరే చెప్పాడు. మరి వీరిద్దరినీ తెరపై చూపించడానికి ఏ దర్శకుడైనా.. ప్రయత్నిస్తాడేమో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు
Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!