సీత మ్యాజిక్ కోసం శ్రీరాముడు వెయిటింగ్.. కృతి సనన్ కి ప్రభాస్ బర్త్ డే విషెస్, పోస్ట్ వైరల్

Published : Jul 27, 2022, 05:29 PM IST
సీత మ్యాజిక్ కోసం శ్రీరాముడు వెయిటింగ్.. కృతి సనన్ కి ప్రభాస్ బర్త్ డే విషెస్, పోస్ట్ వైరల్

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా స్టార్ గా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా స్టార్ గా వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ వందల కోట్ల బిజినెస్ చేసేవే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఇక ప్రభాస్ తన కెరీర్ లో తొలిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. 

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఓం రౌత్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 

ఇదిలా ఉండగా అందాల మెరుపు తీగ కృతి సనన్ నేడు తన 32వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. దీనితో ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో కృతి సనన్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు. 'హ్యాపీ బర్త్ డే కృతి సనన్. నీవు ఎప్పుడూ చిరునవ్వులతోనే కనిపించాలి. ఆదిపురుష్ లో ఈ ప్రపంచం మొత్తం నీ మ్యాజిక్ చూసేందుకు ఎదురుచూస్తున్నా' అని పోస్ట్ చేశాడు . 

'థాంక్యూ.. నీవు లేకుండా ఇది సాధ్యం కాదు' అంటూ కృతి సనన్ ప్రభాస్ పోస్ట్ కి రిప్లై ఇచ్చింది. బాహుబలిగా ప్రభాస్ రాజసం చూశాం. ఇక శ్రీరాముడిగా ప్రభాస్ పరాక్రమం ఎలా ఉండబోతోందో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ రిలీజ్ కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది