సపరేట్‌ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

Published : Aug 30, 2020, 05:28 PM IST
సపరేట్‌ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్‌.. ఎందుకో తెలుసా?

సారాంశం

ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో రెండు విభిన్న గెటప్‌లోనూ ప్రభాస్‌ కనువిందు చేయనున్నాడని టాక్‌. 

డార్లింగ్‌ ప్రభాస్‌ ఏం చేసినా వార్తే. అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాల్సిందే. దానిపై చర్చ జరగాల్సిందే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇండియన్‌ సూపర్‌ స్టార్‌. ప్రస్తుతం ఆయన్ని మించిన స్టార్‌ ఎవరూ లేని చెప్పొచ్చు. అంతగా తనకంటూ ఓ సపరేట్‌ ఇమేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకున్నారు. 

ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్‌. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఎప్పుడూ కనిపించని లుక్‌లో ప్రభాస్‌ కనిపిస్తారని, రెండు విభిన్న గెటప్‌లోనూ ఆయన కనువిందు చేయనున్నాడని టాక్‌. ఆయనతో పూజా హెగ్గే రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా లాక్‌ డౌన్‌ టైమ్‌లో షూటింగ్‌ ఆగిపోయింది. ఆ సమయంలో ప్రత్యేకమైన విమానంలో చిత్ర బృందం హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇప్పుడు తిరిగి షూటింగ్‌ మొదలు పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో చిత్రీకరణ పున ప్రారంభం చేయాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. అయితే ఈ షెడ్యూల్‌ కూడా ఇటలీలోనే చిత్రీకరించబోతున్నారట. అందుకోసం టీమ్‌కి ప్రత్యేకంగా ఓ ఫ్లైట్‌ అరెంజ్‌ చేయబోతున్నారు నిర్మాతలు.

ఇటలీలో కరోనా విజృంభన తగ్గుముఖం పట్టడంతో అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో కూడా రెండు భారీ సెట్లు ఈ సినిమా కోసం వేశారు. మరి వాటి పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీంతోపాటు ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్‌, అలాగే బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది