‘సాహో’ఎఫెక్ట్ :ప్రభాస్ నెక్ట్స్ ‘జానూ ’ఆపేసారా?

Published : Sep 02, 2019, 05:08 PM IST
‘సాహో’ఎఫెక్ట్ :ప్రభాస్ నెక్ట్స్  ‘జానూ ’ఆపేసారా?

సారాంశం

సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్,  అంటూ  కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వైజ్ గా సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది.ముఖ్యంగా హిందీలో టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెల్తోంది. నార్త్ లో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. బీహార్ వంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది.   

అయితే వినాయిక చవితి , వీకెండ్ ఎఫెక్ట్ ఇప్పటికి దాకా చూపించింది. ఆ డ్రీమ్ రన్ త్వరలోనే క్లోజ్ అవుతోందంటున్నారు ట్రేడ్ నిపుణులు. బాహుబలి సక్సెస్, ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ , కాంపిటేషన్ సినిమాలు లేకపోవటం, భారీ ప్రమోషన్స్,  ప్రోమోలలో వదిలిన భారీ యాక్షన్ సీక్వెన్స్ లు  ఫస్ట్ వీకెండ్ కు కలిసొచ్చాయి. గణేష్ చతుర్ది సైతం మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే రేపటి నుంచి సాహోకు అసలైన టెస్టెంట్ టైమ్. 

అది ప్రక్కన పెడితే సాహో కొట్టిన దెబ్బకు ...ఆయన తదుపరి చిత్రం జాను పై పడిందని సమాచారం. మీడియా వర్గాల్లో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి ఈ సినిమా ఆపేసారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే జరిగింది. పూజ హెడ్గే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. అయితే సాహోప్రమోషన్స్ కోసం ఆ షూటింగ్ ఆపు చేసారు. 

సాహో ఫెరఫార్మెన్స్ బట్టి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్దామనుకున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందే ఆ సినిమాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రక్కన పెడ్డటమే బెస్ట్ అని నిర్మాతలు యువి క్రియేషన్స్ నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే సాహో రన్ పడిపోతే రికవరీలు ఇవ్వాలి. ఆ ఇంపాక్ట్ నెక్ట్స్ ఫిల్మ్ మీద పడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?