ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యినట్లేనా రాజా?

Published : Sep 02, 2019, 04:54 PM IST
ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యినట్లేనా రాజా?

సారాంశం

'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని రెడీగా ఉన్నారు.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

 

'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని రెడీగా ఉన్నారు.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకుంటే అదీ ముందుకు వెళ్లలేదు.

అయితే ఈ లోగా మాస్ మహా రాజ రవితేజ స్వయంగా పిలిచి తనను డైరక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చారు. అజయ్ భూపతి తన దగ్గర ఉన్న కథని నేరేట్ చేసారు. రవితేజ చాలా ఎక్సైట్ అయ్యి సినిమా చేద్దామన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని టాక్ వచ్చింది. కానీ ప్రాజెక్టు మాత్రం ఇప్పటికి ఎనౌన్స్ కాలేదు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమా కాన్సిల్ అయ్యనట్లే అని తెలుస్తోంది. అజయ్ భూపతి కథ బాగున్నా..బడ్జెట్ ఎక్కువని, మరో హీరో సైతం ఈ కథలో అవకాసం ఉందని, ఇప్పుడు రవితేజ కు ఉన్న  మార్కెట్ దృష్ట్యా కష్టం అని ప్రక్కన పెట్టారంటున్నారు. 

రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు.  మరి ఆయన ఆజయ్ భూపతి చెప్పబోయే   యాక్షన్ స్క్రిప్ట్ 'మహాసముద్రం'ను ఎవరికి నచ్చి రంగంలోకి దిగుతారో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే