`కలి` సినిమా కోసం ప్రభాస్‌, `కల్కి` డైరెక్టర్‌.. టీజర్‌ ఎలా ఉందంటే..

Published : Jul 07, 2024, 07:39 PM ISTUpdated : Jul 07, 2024, 07:44 PM IST
`కలి` సినిమా కోసం  ప్రభాస్‌, `కల్కి` డైరెక్టర్‌.. టీజర్‌ ఎలా ఉందంటే..

సారాంశం

`కల్కి` సినిమాతో సంచలనం సృష్టిస్తున్న ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు `కలి` సినిమా కోసం నిలబడటం విశేషం. ఈ మూవీ టీజర్‌ ని రిలీజ్‌ చేశారు.   

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కలిసి ఓ వైపు ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన `కల్కి 2898ఏడీ` సినిమా భారీ విజయం దిశగా వెళ్తుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అంతటా ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ పేరు మారుమోగుతుంది. ఈ క్రమంలో ఆయన `కలి` సినిమాకి సపోర్ట్ గా నిలవడం విశేషం. ప్రిన్స్, నరేష్‌ అగస్త్య కలిసి నటించిన సినిమా `కలి`. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసి తన విషెస్‌ తెలియజేశాడు. అంతేకాదు ఈ మూవీని ప్రభాస్‌ కూడా సపోర్ట్ చేయడం విశేషం. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ చిత్ర టీజర్‌ని పోస్ట్ చేశారు. టీమ్‌కి అభినందనలు తెలిపారు. 

దీంతో ఇంతకి ఏంటీ `కలి`? అందులో ఏముంది? టీజర్‌ ఎలా ఉందంటే..? ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం `కలి` టీజర్‌ని నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. `టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు.  

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ఇందులో శివరామ్‌(ప్రిన్స్) ఆ లోకంలో ఉండొద్దు, మనిషి జన్మనే తనకు వద్దు అని సమాజంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడు. ఈ సందర్భంగా తన చివరి కోరికగా ఈ విషయాన్ని చెబుతాడు. కట్‌ చేస్తే, అపరిచిత వ్యక్తి(నరేష్‌ అగస్త్య) సీన్‌లోకి వస్తాడు. ప్రిన్స్ ని ఇంటరాగేట్‌ చేస్తుంటాడు. ప్రిన్స్ తనని తాను చంపుకుంటున్నట్టుగా నరేష్‌ చెబుతుంటాడు. శిఇవరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 

ఈ సినిమా గురించి చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, కలి పాత్ర నేపథ్యంతో సాగే ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం` అని అన్నారు. ఈ చిత్ర నిర్మాత లీలా గౌతం వర్మ మాట్లాడుతూ, `నాగ్ అశ్విన్ గారు ఎంతో బిజీగా ఉన్నా మాకు టైమ్ ఇచ్చి "కలి" మూవీ టీజర్ ను లాంఛ్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం అని చెప్పారు. రచయిత మరియు డైరెక్టర్ శివ శేషు మాట్లాడుతూ "కలి" సినిమాను ఓ సరికొత్త కథాంశంతో రూపొందించాం. మైథాలజీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్స్ కలిపిన చిత్రమిది. "కలి" సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం` అని చెప్పారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌