పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఎట్టకేళలకు చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతి సనన్ సీతారాములుగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. హిందూ పురాణాల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఎట్టకేళకు ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 2డీ, 3డీలో ఐదు భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. వచ్చే నెలలోనే రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నిన్న ట్రైలర్ ను కూడా లాంఛ్ చేశారు. మెరుగైన సీజీ వర్క్ తో విజువల్ ట్రీట్ అందించారు. గతంతో పోల్చితే ట్రైలర్ అద్భుతమనిస్తోంది. అలాగే రాముడిగా ప్రభాస్ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ట్రైలర్ లోని డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎం అన్నీ అదిరిపోయాయి. Adipurush Trailerను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. అన్నీ భాషల్లో ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.
హిందీ ట్రైలర్ కు మాత్రం భారీ స్పందన లభిస్తోంది. గతంలో 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్స్ గా 49 మిలియన్లతో కేజీఎఫ్, 51 మిలియన్ల వ్యూస్ తో ‘తూ జ్యూతీ మై మక్కర్’ చిత్రాలు టాప్ లో నిలిచాయి. ఇక తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం ఆ రెండు చిత్రాలను దాటి రికార్డు క్రియేట్ చేసింది. ట్రైలర్ హిందీలో 52 మిలియిన్ల వ్యూస్ దక్కడం విశేషం. అలాగే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వ్యూడ్ వీడియోగానూ ఒకే రోజులో రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా హిందీ ట్రైలర్ కు ఫాస్టెస్ట్ 100కే లైక్స్ దక్కాయి. స్ట్రీమింగ్ ద్వారా 230కే ప్లస్ వ్యూవర్స్ ట్రైలర్ ను వీక్షించారు. ఇక అన్నీ భాషల్లో కలిపి కేవలం 10 నిమిషాల్లోనే మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో #1గా ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ - కృతిసనన్ జంటగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
breaking records all over! 🏹🔥
Trailer out now: https://t.co/AQIXcRmqQk
Jai Shri Ram 🙏 pic.twitter.com/EBxp7irjTf