గాడ్ ఫాదర్ నుండి మరో సాంగ్... ఈసారి నజభజ అంటా!

Published : Sep 27, 2022, 01:07 PM IST
గాడ్ ఫాదర్ నుండి మరో సాంగ్... ఈసారి నజభజ అంటా!

సారాంశం

విడుదల దగ్గరపడుతుండగా గాడ్ ఫాదర్ టీం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆ మూవీ నుండి సెకండ్ సింగిల్ సిద్ధం చేశారు. ''నజభజ'' అనే సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. 


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా వచేస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్ గా సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయనున్నారు. కెరీర్ లో మొదటిసారి చిరు సరికొత్త రోల్ చేయగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయడం మరో విశేషం. ఇటీవల మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ''థార్ మార్ థక్కర్ మార్''  విడుదల చేశారు. సల్మాన్, చిరంజీవి కలిసి చేసిన ఈ సాంగ్ ఆకట్టుకుంది. 

నేడు సెకండ్ సింగిల్ కి ముహూర్తం పెట్టారు. సాయంత్రం 5:04 నిమిషాలకు ''నజభజ'' అనే సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్  అధికారిక రీమేకే గాడ్ ఫాదర్. అక్కడ మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలకమైన క్యామియో అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. 

ఇక గాడ్ ఫాదర్ మూవీపై అనుకున్న స్థాయిలో బజ్ లేదు. ఇది మేకర్స్ ని భయపెడుతుంది. బిజినెస్ కూడా డల్ గా జరిగింది. ఆచార్య రిజల్ట్ నేపథ్యంలో గాడ్ ఫాదర్ కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపలేదు. తక్కువ ధరలకు అడుగుతున్న నేపథ్యంలో చాలా ఏరియాల్లో సొంతగా విడుదల చేస్తున్నట్లు సమాచారం. అలాగే హీరో సల్మాన్ సైతం మూవీ అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగాలేడట. హిందీలో విడుదల చేయవద్దని ఆయన చెప్పినట్లు పుకార్లు వినిపించాయి. ఫ్యాన్స్ మాత్రం మూవీ విజయం పట్ల విశ్వాసంతో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

జీవితాల‌ను త‌ల‌కిందులు చేసిన ఒక్క రాత్రి.. నిజ జీవిత క‌థ‌తో పిచ్చెక్కిచ్చే సినిమా. ఏ OTTలో ఉందంటే?
Illu Illalu Pillalu మార్చి 6 ఎపిసోడ్: నర్మదకు ఆఫీసులో అవమానం, రైస్ మిల్లుకు వెళ్లేందుకు రామరాజు ప్లాన్