
బాహుబలి2 రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ మొత్తం మీడియా ఇంటర్వ్యూలతో అదరగొడుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గా అలరిస్తున్న.. ప్రభాస్ తన రాజకీయ అనుభవం గురించి వెల్లడించారు. మొగల్తూరులో కృష్ణంరాజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా... పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారట. అప్పుడు స్థానికంగా ఉండే ఓటర్లంతా వచ్చి జెండా పీకారని, వేరే పార్టీ వాడు జెండా పాతాడని, ఇలా రకరకాల జెండా కంప్లైంట్స్ చేసేవారట.
ఆ టైమ్ లో పొద్దున్నే లేవగానే ఈ గోలేంట్రా బాబో అనిపించేదట ప్రభాస్ కు. ఉదయాన్నే లేవటమే ఎక్కువరా అంటే... వింత వింత ఫిర్యాదులు వినిపించేవట తనకు. అయితే.. ఓటర్ల మీద ఉండే రెస్పెక్ట్ తో... వాళ్లు చెప్పిందంతా ఓపిగ్గా వినేవాడట ప్రభాస్. ఎందుకంటే.. తన వల్ల ఓట్లు రాలకున్నా పోకూడదని భావించేవాడట.
ఓపిక గురించి ప్రభాస్ మాటల్లోనే...
నాకు అసలు ఓపిక అంటే 17 ఏళ్ల వయసప్పుడు తెలిసి వచ్చింది. మొగల్తూరులో పెదనాన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. నాకు మొగల్తూరు బాధ్యతలు నెల రోజుల పాటు అప్పజెప్పారు. అక్కడ స్థానికంగా ఉండే వాళ్లంతా వచ్చి నాతో ఈ జెండా పెట్టలేదు. ఆ జెండా పెట్టలేదు. వాడక్కడ జండా పెట్టాడు.. వీడిక్కడ జెండా పెట్టాడు. అని అలా ఏవేవో కంప్లైంట్లు. మన వల్ల ఓటైతే రాదు. పోకూడదు అనుకున్నా. వాళ్ల మాటలన్నీ వినాలి. సో విన్నా. దానికి ఎంత ఓపిక కావాలో. అన్నాడు ప్రభాస్.
ఇక ఆ తర్వాత మాత్రం నాన్న వాళ్లకు దండంపెట్టా.. ఇంకోసారి నన్ను పిలవద్దన్నా. అప్పుడే నాకు పేషన్స్ వచ్చింది. నాదో డిఫరెంట్ మైండ్ సెట్.. రాజకీయాల్లోకి రాను. అని ప్రభాస్ చెప్పాడు.