సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

Published : Aug 24, 2019, 04:49 PM IST
సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

సారాంశం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో'.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.   

బాహుబలితో దేశం మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో మరోసారి అబ్బురపరచబోతున్నాడు. సాహో తర్వాత సినిమాలపై తన ప్లాన్ ఏంటనే విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. తన తదుపరి చిత్రాలు భారీ బడ్జెట్ ఉండవని ప్రభాస్ తేల్చేశాడు. ఇకపై అనవసరమైన ఒత్తిడి తీసుకోలేను. భారీ బడ్జెట్ సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తా. ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా అని ప్రభాస్ తెలిపాడు. 

బాహుబలి తరహాలో సాహో చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను. కానీ బాహుబలి అభిమానులందరినీ ఈ చిత్రం అలరించే విధంగా ఉంటుంది అని ప్రభాస్ తెలిపాడు. సాహో కనుక హిందీలో ఇతర భాషల్లో వర్కౌట్ అయితే పాన్ ఇండియన్ సినిమాలు కొనసాగిస్తా. ఇకపై పాన్ ఇండియన్ సినిమాలు చేసేది చేయనిది సాహో రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని ప్రభాస్ తెలిపాడు. ఇది ఒకరకంగా నార్త్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్తే. 

యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిర బేడీ, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది