
అటు సినిమాలు.. ఇటు పాలిటిక్స్.. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ.. దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎంత ఒత్తిడి ఉన్నా.. రెండింటిని రెండు కళ్ల మాదిరి చూసుకుంటూ.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాు. ఈక్రమంలోనే పవన్ పాలిటిక్స్ పరంగా 2024 ఎన్నికలపై గట్టిగా ఫోకస్ చేశారు. ఈ నెల సినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి.. సమ్మర్ అయిపోయేవరకూ.. సినిమాలకుసబంధించిన పనులన్నీ పూర్తి చేసి.. ఎలక్షన్ వార్ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రలో పవన్ వైపు పాజిటీవ్ పవనాలు వీస్తుండటంతో.. ఆయన కదనరంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు.
ఈక్రమలోనే ఎలక్షన్ క్యాప్పైన్ కోసం పవర్ స్టార్ వారాహి వాహనాన్ని సిద్థం చేసుకున్నారు. త్వరలో ఈ వాహనంలో ఆయన ప్రజల్లోకి పూర్తిగా వెళ్లనున్నారు. ఎన్నికల వరకు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు పవర్ స్టార్. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని చూస్తున్నారు పవన్. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ జోతీష్యంపై కూడా దృష్టి పెట్టారట. జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా పవన్ నమ్ముతున్నారు. ఆటంకాలు తొలిగిపోవడానికి.. అధికారం సాధించడానికి.. శాస్త్రం ప్రకారం ఏం చేయాలి అన్న విషయంలో పవన్ ఆలోచిస్తుననట్టు తెలుస్తోంది. దానికి కావల్సిన పరిహారాలు కూడా చేయడానికి ఆయన రెడీ అయ్యారట.
ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాబేలు ఉంగారాన్ని ధరించినట్టు తెలుస్తోంది.. ఆయన తన కుడి చేతి ఉంగరం వేలుకు బంగారంతో తయారు చేసిన తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నారు. తాబేలు ఉంగరం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరం పెట్టుకుంటేపాజిటివ్ శక్తి వస్తుందట. ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగారాన్ని ధరించటానికి లేదు. కొన్ని రాశుల వారే ధరించాలి. మహా విష్ణువు అవతారాల్లో ఒకటి తాబేలు..అందుకే ఇది చాలా పవర్ ఫుల్ అంటారు.
ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఈ ఉంగారాన్ని పెట్టుకోవటం వల్ల మంచి లాభాలను పొందొచ్చట. పవన్ తాను ఆర్థికంగా సరిగా లేనని చాలా సార్లు చెప్పారు. ఆర్థికంగా, తాను ఎంచుకున్న రాజకీయ రంగంలో విజయం సాధించటానికే జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఈ తాబేలు ఉంగరం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.