బ్రో మూవీకోసం పవన్ కళ్యాణ్ క్రేజీ షూస్.. వైరల్ చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్, కాస్ట్ ఎంతో తెలుసా..?

Published : Jul 01, 2023, 07:21 PM IST
బ్రో మూవీకోసం పవన్ కళ్యాణ్ క్రేజీ షూస్.. వైరల్ చేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్, కాస్ట్ ఎంతో తెలుసా..?

సారాంశం

స్టార్ సెలబ్రిటీలువేసుకునే బట్టలు, వాడే షూస్.. తిరిగే కార్లు.. ఉండే ఇల్లు.. ఇలా అన్నింటిమీద సోషల్ మీడియా కన్ను ఉంటుంది. స్టార్స్  కాస్త వెరైటీగా ఏదైనా వాడారంటే చాలు.. ఇక అది నెట్టింట్లో వైరల్ అవ్వాల్సింది.. ఫ్యాన్స్ రచ్ రచ్చ రచ్చ చేయాల్సిందే. తాజాగాపవర్ స్టార్ వాడిన షూస్ హాట్ టాపిక్ గా మారాయి. 

సినిమాలలో తమ అభిమాన స్టార్ ను  అభిమానించడంతో పాటే.. ఫ్యాన్స్ వారి పర్సనల్ లైఫ్ కు సబంధించిన వాటిపై కూడా దృష్టి పెట్టడం చూస్తూనే ఉన్నాం. కాస్త వెరైటీగా స్టార్స్  ఏదైనా వస్తువు వాడితే చాలు అది వైరల్ అవ్వాల్సిందే. కాట్లీగా ఏదైనా యూస్ చేస్తే.. నెట్టింట్లో రచ్చ అవ్వాల్సిందే. తో పాటు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. స్టార్ సెలబ్రిటీలువేసుకునే బట్టలు, వాడే షూస్.. తిరిగే కార్లు.. ఉండే ఇల్లు.. ఇలా అన్నింటిమీద సోషల్ మీడియా కన్ను ఉంటుంది. అంతే కాదు వేసుకునే చెప్పులు.. పెట్టుకునే ఆర్నమెంట్స్, వాటి ధరలు తెలిస్తే షాక్‌తో పాటు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. 

స్టార్ హీరోల రెమ్మూనరేషన్ కోట్లా రూపాయల్లో ఉంటుంది. అందుకే వారి  స్టేటస్‌ని బట్టే.. వారి మెయింటినెన్స్ కూడా సాలిడ్‌గా ఉంటుంది. ఇక సెలబ్రిటీస్ వాడే వస్తువుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ ఫర్మేషన్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడిన షూ కాస్ట్ గురించి ఓన్యూస్ తెగ వైరల్ అవుతోంది.  పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ‘బ్రో’ది అవతార్ క్యాప్షన్ తో రూపొందుతున్న.. ఈసినిమాను యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇస్తున్నారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మెగా మామా అల్లుళ్లు పవన్ కల్యాణ్ , సాయి తేజ్ కలిసి నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలుఉన్నాయి. ఈ క్రేజీ కాంబోలో సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్  చేసుకుంటూ.. అటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకుంటోంది.  జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ పోస్టర్‌లో కనిపించిన గెటప్ చూసి, అందులో ఆయన వేసుకున్న షూస్ గురించి..వాటి కాస్ట్ గురించి న్యూస్  వైరల్ అవుతుంది.

పోస్టర్ లో పవర్ స్టార్ వేసుకున్న షూస్  బాలెన్సియాగా బ్రాండ్‌కి చెందినవి.  డిఫెండర్ బ్లాక్ స్నీకర్స్ షూస్.. కాస్ట్  88,732 వేలు అని తెలుస్తోంది. చాలాస్టైలీష్ గా ఉన్న ఈ షూస్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అంతే కాదు కాస్త డబ్బుండి ముచ్చటపడ్డవారు వాటిని వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నారు.  ఇక ఈసినిమాలో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్.. ఇతరత్ర చూస్తే.. ఆయన లుక్ ఎంత బాగుండబోతోందో తెలుస్తోంది. 

ఇక ప్రస్తుతం పొలిటికల్ యాత్రలతో బిజిగా ఉన్నాడు పవర్ స్టార్. వారాహీ యాత్రతో.. ఆధ్రా అంతా తిరుగుతున్నారు. రీసెంట్ గా ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారాహీ యాత్రం కు బ్రేక్ ఇచ్చి..బ్రో సినిమా  టీజర్ కు డబ్బింగ్ ఫినిష్ చేశాడు.  ఓజీ’ సగం పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్‌‌పైకి వెళ్లింది. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎండింగ్ ఉంది. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో