హరి హర వీరమల్లు ఆగిపోలేదు.. పవర్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. రూమర్స్ కు చెక్..

Published : Sep 02, 2023, 07:39 AM ISTUpdated : Sep 02, 2023, 07:40 AM IST
హరి హర వీరమల్లు ఆగిపోలేదు.. పవర్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. రూమర్స్ కు చెక్..

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు హరిహరవీరమల్లు టీమ్. ఈసినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నట్టు హింట్ కూడా ఇచ్చారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు పవర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన 46 కేజీల వెండితో.. డిఫరెంట్ గా భహుమతి ప్లాన్ చేసిన ఫ్యాన్స్.. వేడుకలను కూడా అట్టహాసంగా చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.మరో వైపు పొలిటికల్ గా కూడా జన సైనికులు  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సిద్దం అవుతున్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్లు కూడా వరుసగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.. తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి.. వీరుడి గెటప్ లో పవర్ స్టార పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. 

తాజాగా మేకర్స్.. హరి హర వీరమల్లు మూవీ నుంచి  పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్తలుక్ లో పోస్టర్ ను రిలీజ్ చేశారు.  అర్ధరాత్రి 12:17 నిమిషాలకు ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అందరికంటే ముందే పోస్టర్ రిలీజ్ చేసి.. హరిహర వీరమల్లు సినిమా పై వస్తున్న రూమర్స్ కు చెక్ చెప్పారు. ఈసినిమా ఆగిపోలేదని.. షూటింగ్ కాస్త లేట్ అవ్వచ్చేమో కాని.. ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నట్టుగా హింట్ ను ఇచ్చేశారు. ఇకపోతే సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్ఓచిన్న బర్త్ డే నోట్కూడా రాశారు. ఈ సంతోషకరమైన రోజున, మన హరిహరవీరమల్లు యొక్క అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణను జరుపుకుంటున్నాము అని ఆ నోట్ సారాంశం. 

 

ఈ పోస్టర్ లో పవన్ ను ఒక యోధుడిగా చూపించారు. ఇప్పటి వరకూ కోర మీసాలు, క్లీన్ షేవ్ తో కనిపించిన వీరమల్లు.. ఇందులో మాత్రం గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించారు. ఇది సినిమాలో ఒక ఫైట్ సీన్ అని తెలుస్తోంది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే  రిలీజ్ అయిన పోస్టర్స్.. గ్లింప్స్, కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా ఆరోజు (సెప్టెంబ‌ర్ 02) పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన  బ్రాండ్ న్యూ పోస్టర్ కు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ కనిపిస్తోంది. 

ఇక ఈసినిమాలో కన్నడ భామ.. ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈసినిమా షూటింగ్ పై గతంలో రకరకాల రూమర్లు వినిపించాయి. క్రిష్ పై అసంతృప్తితో ఉన్న పవర్ స్టార్ ఈసినిమాను పక్కన పెట్టారని చాలా కాలం ప్రచారం జరిగింది. అన్ని సినిమాలకు డేట్లు ఇస్తూవస్తున్న పవర్ స్టార్.. ఈసినిమాకు మాత్రం డేట్స్ అజెస్ట్ చేయలేకపోతున్నారు. ఈక్రమంలో ఏపీ ఎలక్షన్స్ కూడా దగ్గరోలే ఉండటంతో.. ఎలక్షన్స్ తరువాత ఈసినిమా కంప్లీట్ చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేదు సినిమాలననీ పూర్తి చేసిన తరువాతే ఆయన ఎలక్షన్స్ కు వెళ్తారని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ