పవన్ జాగ్రత్త అలా చేస్తే నిన్ను చంపేస్తారు : పోసాని

Published : Mar 22, 2018, 03:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
పవన్ జాగ్రత్త అలా చేస్తే  నిన్ను చంపేస్తారు : పోసాని

సారాంశం

పవన్ కల్యాణ్ నిరాహారదీక్ష చేస్తే, పోసాని మద్దతు ఇస్తానని తెలిపారు ఆయన నిరాహారదీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవడం లేదన్నారు ఆమరణ దీక్షకు కూర్చోబెట్టాలనుకుంటున్నారు..నిన్ను చంపినా చంపేస్తారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందనే ఆరోపణల్లో వాస్తవం లేదని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. దానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసి ఉంటే ఆయనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని... అయినప్పటికీ వేదికపై నుంచి టీడీపీపై విమర్శలు గుప్పించారంటే... ఆ విమర్శల్లో నిజం ఉంటుందని అన్నారు. పవన్ ను తాను నమ్ముతున్నానని చెప్పారు. 

పవన్ కల్యాణ్ నిరాహారదీక్ష చేస్తే, తాను మద్దతు ఇస్తానని తెలిపారు. అయితే, ఆయన నిరాహారదీక్షకు కూర్చోవాలని తాను కోరుకోవడం లేదని... అందరూ బాగున్నప్పుడు పవన్ మాత్రమే ఎందుకు నిరాహార దీక్ష చేయాలని ప్రశ్నించారు. 'పవన్ కల్యాణ్... నీకు బాగా ఎక్కించి, ఆమరణ దీక్షకు కూర్చోబెట్టాలనుకుంటున్నారు. నిన్ను చంపినా చంపేస్తారు. ఐలవ్యూ నాన్నా. నీవు దీక్షకు కూర్చోవద్దు' అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. నిరాహారదీక్షకు అందరూ కూర్చుంటేనే... పవన్ కూడా కూర్చోవాలని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?