జగన్ కోరితే రెడీ అంటున్న నటులు!

Published : Jun 22, 2019, 03:23 PM IST
జగన్ కోరితే రెడీ అంటున్న నటులు!

సారాంశం

ఇటీవల ముగిసిన ఎన్నికలలో భాగంగా కొందరు సినీ ప్రముఖులు ప్రత్యర్థులపై విమర్శలతో చర్చనీయాంశంగా మారారు. కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి వైయస్ జగన్ కు మద్దతు తెలుపుతూ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. 

ఇటీవల ముగిసిన ఎన్నికలలో భాగంగా కొందరు సినీ ప్రముఖులు ప్రత్యర్థులపై విమర్శలతో చర్చనీయాంశంగా మారారు. కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి వైయస్ జగన్ కు మద్దతు తెలుపుతూ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ఈ ఎన్నికలకు ముందు వైసిపి తరుపున పోసాని, పృథ్వి, అలీ లాంటి నటులకు ఎదో ఒక పదవి ఖాయం అనే ఊహాగానాలు వినిపించాయి. 

ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. వైసిపి అఖండ విజయం సాధించింది. కానీ జగన్ వైసిపి తరుపున ప్రచారం చేసిన సినీ నటులకు ఇంతవరకు ఎలాంటి పదవి కానీ, భాద్యత కానీ అప్పగించలేదు. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోసాని, పృథ్వి స్పందించారు. 

ప్రస్తుతం ఉన్న నాయకుల్లో జగన్ బెస్ట్ అని నమ్మే తాము మద్దతు తెలిపామని పోసాని, పృథ్వి అన్నారు. వైసిపి విజయం సాధించింది అది చాలు. జగన్ సమర్థవంతమైన పాలన అందిస్తారు. నాకు ఎలాంటి పదవి అవసరం లేదు అని పోసాని అన్నారు. ఒకవేళ జగనే స్వయంగా పిలిచి.. ఈ పని మీరు చేస్తే బావుంటుంది అని కోరితే తప్పకుండా చేస్తానని అన్నారు. 

పృథ్వి కూడా ఇదే తరహా సమాధానం ఇచ్చారు. జగన్ పిలిచి పార్టీ కోసం పనిచేయమని బాధ్యత అప్పగిస్తే తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. కొన్ని రోజుల క్రితం టిడిడి చైర్మన్ పదవిని మోహన్ బాబు ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ అవకాశం వైసీ సుబ్బారెడ్డికి దక్కింది. తాను ఎలాంటి పదవి ఆశించలేదని అప్పుడే మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?