పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌,హాస్పటిల్ లో

Published : Jul 30, 2021, 07:05 AM IST
పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌,హాస్పటిల్ లో

సారాంశం

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందనే ఆనందం ఆవిరి అవుతోంది. మళ్లీ కరోనా కేసులు మొదలయ్యాయి. ఆ మధ్యన  సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కోలుకున్నారు. తాజాగా  ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని... తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని  కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.  
 

PREV
click me!

Recommended Stories

Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్