సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి లైకా ప్రొడక్షన్‌ భారీ విరాళం ..

Published : Jun 19, 2021, 03:52 PM ISTUpdated : Jun 19, 2021, 03:58 PM IST
సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి లైకా ప్రొడక్షన్‌ భారీ విరాళం ..

సారాంశం

ప్రముఖ సౌత్‌ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ తమిళనాడు ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాతో పోరులో తమ వంతు సాయం ప్రకటించింది. శనివారం లైకా ప్రతినిధులు సీఎం స్టాలిన్‌ని కలిసి చెక్‌ని అందజేశారు. 

ప్రముఖ సౌత్‌ దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ తమిళనాడు ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాతో పోరులో తమ వంతు సాయం ప్రకటించింది. లైకా ప్రొడక్షన్‌ నుంచి ఏకంగా రూ. రెండు కోట్లు తమిళనాడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేసింది. శనివారం లైకా ప్రతినిధులు సీఎం స్టాలిన్‌ని కలిసి రెండు కోట్ల చెక్‌ని అందజేశారు. దీంతో కరోనా సెకండ్‌ వేవ్‌లో సినిమా రంగం నుంచి అత్యధికంగా విరాళం ప్రకటించిన సంస్థగా లైకా నిలిచింది.

లైకా ప్రొడక్షన్స్ కి నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్‌ అధినేతగా ఉన్నారు. తన తరపున లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ సచివాలయంలో సీఎంకి అందజేశారు.  లైకా తమిళంలో అనేక భారీ చిత్రాలను నిర్మిస్తుంది. తెలుగులో చిరంజీవి రీఎంట్రీ చిత్రం `ఖైదీ నెంబర్ 150`, తమిళంలో విజయ్‌ తో `కత్తి`, రజనీకాంత్‌ `2.0`, `దర్బార్‌`, `కప్పన్‌'(బందోబస్త్) చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు `భారతీయుడు 2`, `పొన్నియిన్‌ సెల్వన్‌`, `రామ్‌ సేతు`, `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రాలను నిర్మిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ