'మహర్షి' 10వ సారి కుమ్మేసింది

Surya Prakash   | Asianet News
Published : Jun 19, 2021, 03:19 PM IST
'మహర్షి' 10వ సారి కుమ్మేసింది

సారాంశం

 మ‌హేష్ బాబు- క్రేజీ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం మ‌హ‌ర్షి. ఈ సినిమా మ‌హేష్ కెరియ‌ర్‌లో 25వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని సాధించింది. 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహర్షి”. సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు కానీ మెల్లిమెల్లిగా ఊపందుకుంది.  ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ అయ్యింది. ఇప్పుడూ అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. 

 తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించ‌గా, ప‌దోసారి 7.82 రేటింగ్స్‌తో అదరగొట్టింది. ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్‌లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు.  ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటం అరుదైన ఘటనే. మహర్షి సినిమా పదవ సారి టెలికాస్ట్ అయిన సమయంలో ఇతర ఛానెల్స్ లో మంచి సినిమాలు ఏమీ లేక పోవడం ఒక కారణం అని కొందరు అంటున్నారు. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

1st Time: 9.3 
2nd time : 7.3 
3rd Time: 6.13
4th time: 9.02 
5th Time: 10.28 
6th Time: 8.82
7th Time: 7.14 
8th Time: 5.14 
9th Time: 4.92 
10th Time: 7.82**

మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షి ప్ర‌త్యేక ఘ‌న‌త‌ను సాధించ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌హ‌ర్షి చిత్రం మ‌హేష్ కెరియ‌ర్‌లో 25వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని సాధించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది.
 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే
Illu Illalu Pillalu Today: వల్లి పెట్టిన చిచ్చు, ఘోరంగా మోసపోయిన సాగర్, భర్త చెంప పగలకొట్టిన నర్మద