కర్ణాటకలో ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ (Kailash Kher)పై వాటర్ బాటిళ్లపై దాడి జరిగింది. హంపీ ఉత్సవ్ లోని మ్యూజిక్ కన్ సర్ట్ లో ఘటన జరిగింది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పై కొందరు వాటర్ బాటిళ్ల దాడి చేశారు. కర్ణాటకలోని హంపీ ఉత్సవాల్లో భాగంగా మ్యూజిక్ కన్సర్ట్ కోసం వెళ్లిన ఆయనకు చేధు అనుభం ఎదురైంది. ఉత్సవాల్లో భాగంగా వేదికపై కైలాష్ ఖేర్ పాటను ఆలపిస్తుండగా ప్రేక్షకుల నుండి కొందరు బాటిల్‌తో దాడి చేశారు.
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా కర్ణాటకలోని హంపిలో ఆదివారం హంపి ఉత్సవ్ వేదికను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాష్ కేర్ వేదికపై పాట పాడుతుండగా ఉన్నట్టుండి కొందరు దాడికి దిగారు. ఎందుకు ఏంటనేది తెలియలేదు. వెంటనే సిబ్బంది వేదికపై నుండి వాటర్ బాటిల్‌ను తొలగించారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు. అలాగే కైలాష్ కు సెక్యూటిరి ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ANI సమాచారం ప్రకారం.. విజయనగరం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. వారిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కార్యక్రమంలో కన్నడ పాటలు పాడనందుకు కైలాష్ ఖేర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాడి చేసినట్టు తెలిపారు. ఇక ఆదివారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
రీసెంట్ గా సింగర్ మంగ్లీ జనవరిలో కర్ణాటకలోని హోస్పేటలో దాడికి గురైనట్టు వార్తలు వచ్చాయి. కర్నాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఆమె వేదికపై తెలుగులో మాట్లాడటం ప్రారంభించిన సందర్భంలో ఎదురుదెబ్బ తగినట్టు సమాచారం. కానీ దానిపై మంగ్లీ స్పందిస్తూ అలాంటిదేమీ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.