బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ యాక్షన్ ఫిల్మ్ సక్సెస్ పై తాజాగా కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’(Pathaan)పై తాజాగా స్పందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంతో తెరకెక్కింది. షారూఖ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటించింది. మరో ప్రధాన ప్రాత్రలో జాన్ అబ్రహం నటించారు. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.
ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటి సత్తా చాటుతోంది. ఈచిత్రం సక్సెస్ పై యూనిట్, ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే సినిమాను థియేటర్లలో వీక్షిస్తూ డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తున్న వీడియోపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా స్పందించారు. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం.. పఠాన్ విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇండియా వైడ్ గా రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన అత్యంత వేగంగా చిత్రంగా SS రాజమౌళి యొక్క బాహుబలి 2, యష్ నటించిన KGF 2 చిత్రాలను అధిగమించింది.
undefined
2020లో తన ఖాతా నిషేధించబడిన తర్వాత రీసెంట్ గా ట్వీటర్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పఠాన్ ఎందుకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందో విశ్లేషించిన ఓ పోస్ట్‌ను రీట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై స్పందిస్తూ ఇలా రాసింది. చాలా మంచి విశ్లేషణ... ఈ దేశం ఖాన్‌లను ప్రేమిస్తుంది. కొన్నిసార్లు ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం నటీమణులపై మక్కువ ఉంది. కాబట్టి భారతదేశాన్ని ద్వేషం మరియు ఫాసిజం అని ఆరోపించడం చాలా అన్యాయం. ప్రపంచం మొత్తంలో భారత్ (భారత జెండా ఎమోటికాన్) లాంటి దేశం లేదు.’ అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో.. తను నటించి ‘ధాఖడ్’ చిత్రం ఇండియన్ సినిమాల్లో ఫ్లాఫ్ గా చెప్పారు. పఠాన్ ఈ ఏడాది సక్సెగా నిలిచింది. పదేండ్లలో షారుఖ్ కు ఇది తొలి విజయం’ అంటూ కూడా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వరుస ట్వీట్లతో కంగనా నెట్టింట దుమారం రేపుతోంది.
Very good analysis… this country has only and only loved all Khans and at times only and only Khans…And obsessed over Muslim actresses, so it’s very unfair to accuse India of hate and fascism … there is no country like Bharat 🇮🇳 in the whole world 🥰🙏 https://t.co/wGcSPMCpq4
— Kangana Ranaut (@KanganaTeam)
Haan ji Dhaakad bahut badi historic flop rahi hai, iss baat se maine kab mana kiya? SRK ji ki dus saal mein yeh pehli film chali hai,hum bhi unse prerna lete hain, ummeed hai jaise Bharat ne unko mauka diya humko bhi milega, after all yeh Bharat Mahan hai udar hai,Jai Shri Ram🚩
— Kangana Ranaut (@KanganaTeam)