చిత్ర పరిశ్రమలో విషాదం... ప్రముఖ నటుడు మృతి!

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కళాభవన్ హనీఫ్ కన్నుమూశారు. హనీఫ్ మరణంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 

Google News Follow Us

మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ హనీఫ్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా హనీఫ్ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కొచ్చి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 9న కన్నుమూశారు. హనీఫ్ వయసు 63 ఏళ్ళని సమాచారం. హనీఫ్ తిరుచూరు లో జన్మించారు. 1990లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. పాపులర్ రాజకీయ నాయకులు, నటులను ఇమిటేట్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. 

నరేంద్ర మోడీ, మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్ వంటి స్టార్స్ ని హనీఫ్ చాలా దగ్గరగా ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. అనేక చిత్రాలు, మలయాళం సీరియల్స్ లో ఆయన నటించారు. 

హనీఫ్ సపోర్టింగ్ రోల్స్ ఎక్కవగా చేశారు. మిమిక్రి ఆర్టిస్ట్ కూడా కావడంతో తన పాత్రలను ప్రత్యేకంగా మలిచేవారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామా అద్భుతంగా పండించారు. అనేక వేదికల మీద హనీఫ్ ప్రదర్శనలు ఇచ్చారు.  హనీఫ్ మరణవార్త పరిశ్రమను విషాదంలో నింపింది. ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు  సంతాపం వ్యక్తం చేస్తున్నారు.