పబ్లిక్‌లో భర్తతో జెనీలియా రొమాన్స్.. తట్టుకోలేక జెలసీతో వెళ్లిపోయిన పూజా హెగ్డే.. వీడియో వైరల్‌

Published : Mar 19, 2024, 03:44 PM ISTUpdated : Mar 19, 2024, 03:46 PM IST
పబ్లిక్‌లో భర్తతో జెనీలియా రొమాన్స్.. తట్టుకోలేక జెలసీతో వెళ్లిపోయిన పూజా హెగ్డే.. వీడియో వైరల్‌

సారాంశం

పూజా హెగ్డేకి చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె జెనీలియా, రితీష్‌లను చూసి జెలసీ ఫీల్‌ కావడం గమనార్హం.   

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య డల్‌ అయిపోయింది. ఆమె అవకాశాలు తగ్గడంతో యాక్టివ్‌గా లేదు. అడపాదడపా సోషల్‌ మీడియాలో మెరుస్తుంది. ప్రైవేట్‌ ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తుంది. అలాగే అందాల విందుతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అవకాశాలు తగ్గినా సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తుంది. 

అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతున్నారు. కెరీర్‌ పీక్‌లో ఉండగానే మ్యారేజ్‌ చేసుకుని పర్సనల్‌ లైఫ్‌ని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే ఇంకా సింగిల్‌గానే ఉంది. ప్రేమ, డేటింగ్‌ వంటి వ్యవహారాలకు దూరంగా ఉంటూ సింగిల్‌గానే రాణిస్తుంది. అడపాదడపా ఆమెపై రూమర్స్ వచ్చినా, ఇప్పటి వరకు ఏ విధమైన క్లారిటీ లేదు. 

కపుల్స్ పబ్లిక్‌లో క్లోజ్‌గా మూవ్‌ అయితే, రొమాంటిక్‌గా ఉంటే సింగిల్స్ జెలసీ ఫీలవడం కామన్‌గానే జరుగుతుంది. తాజాగా పూజా హెగ్డే అదే ఫీలయ్యింది. ఆమె జెనీలియా, రితేష్‌ దేశ్‌ ముఖ్‌లను చూసి కుళ్లు పడింది. లేటెస్ట్ గా ముంబయిలో ఓ ఈవెంట్‌లో జెనీలియా, రితేష్‌ దేశ్‌ ముఖ్‌లు పాల్గొన్నారు. ఈ ఇద్దరు కలిసి రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా జెనీలియా, రితేష్‌ సరదాగా నవ్వుతూ, చిలిపిగా అల్లరి చేసుకుంటూ కనిపించారు. అందరి ముందు ఫోటో షూట్‌ మధ్యలో ఈ ఇద్దరు ఇలా రొమాంటిక్‌గా బిహేవ్‌ చేశారు. చాలా సేపు ఈ ఇద్దరు అలానే ప్రవర్తించారు.

పక్కనే పూజా హెగ్డే ఉంది. ఈ ఇద్దరు ఇలా రెచ్చిపోవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. జెలసీతో అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నెటిజన్లని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనిపై మీమ్స్ పేలుతున్నాయి. పాపం పూజా అంటూ, సింగిల్‌ కష్టాలు అంటూ నానా హంగామా చేస్తున్నారు. త్వరగా పెళ్లి చేసుకో పూజా అంటూ సలహాలిస్తున్నారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. 

Read more: Samantha Ruth Prabhu : కెరీర్ గ్యాప్ లో తన జీవితంలో ఎలా ఉందో చెప్పిన సమంత.. ఆసక్తికరంగా సామ్ మాటలు

పూజా హెగ్డే ప్రస్తుతం హిందీలో `దేవా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. `గుంటూరు కారం` నుంచి ఆమెని తప్పించిన విషయం తెలిసిందే. అలాగే పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` నుంచి కూడా తప్పించారు. ఇక సాయిధరమ్‌ తేజ్‌తో చేయాల్సి `గంజాశంకర్‌` ఆగిపోయింది. దీంతో ఉన్న ఆఫర్లని పోయాయి. కొత్త అవకాశాలకు వేట సాగిస్తుందీ బుట్టబొమ్మ. 

Also read: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?