పూజా హెగ్డే ఇంట్లో విషాదం.. ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌ హీరోయిన్‌

Published : Mar 03, 2021, 02:24 PM IST
పూజా హెగ్డే ఇంట్లో విషాదం.. ఎమోషనల్‌ అయిన ప్రభాస్‌ హీరోయిన్‌

సారాంశం

పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. వాళ్లు బామ్మ చనిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే అమ్మమ్మని కోల్పోయినట్టు పూజా హెగ్డే తెలిపారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అమ్మమ్మతో దిగిన ఫోటోని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు.

పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. వాళ్లు బామ్మ చనిపోయారు. తాను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే అమ్మమ్మని కోల్పోయినట్టు పూజా హెగ్డే తెలిపారు. ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అమ్మమ్మతో దిగిన ఫోటోని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పూజా పోస్ట్ చేస్తూ, `ఈ క్యూటీని మేం కోల్పోయాం. ఎన్ని కష్టాలున్నా, ఎప్పుడూ నవ్వుతూనే ముందుకుసాగాలని మాకు నేర్పింది. భౌతికంగా తాను దూరమైనా, ఎప్పటికీ మాతోనే ఉంటుంది` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, `జీవితంలో కావాల్సిన వాళ్ల కోసం ఈగోలను పక్కన పెట్టడం ఎలానో నేర్పించింది. షూటింగ్‌ టైమ్‌లో ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌, భోజనం చేశావా అంటూ ఎప్పటికప్పుడు నా బాగోగులు ఆడిగి తెలుసుకునేది. ఇకపై నీ ఫోన్‌ కాల్స్ మిస్‌ అవుతాను. లవ్‌యూ ఆజీ` అని ఎమోషనల్‌ అయ్యారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు పూజా ద్వారా వాళ్ల బామ్మకి సంతాపం తెలియజేస్తున్నారు.

  పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది జులై 30న విడుదల కానుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది. చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య`లో అతిథి పాత్రలో కనిపించనుందట. ఇందులో చెర్రీకి జోడిగా కనిపించనుందని టాక్‌ మరోవైపు హిందీలో సల్మాన్‌తో `కభీ ఈద్‌ కభీ దీవాళి`, రణ్‌వీర్‌ సింగ్‌తో `సర్కస్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది పూజా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు