మహాభారతం సినిమా తీయాలని చాలా మందికి కోరిక. అయితే అంత భారీతనం, కోట్లలో బడ్జెట్ పెట్టే శక్తి ఉన్న నిర్మాత దొరకటం చాలా కష్టం. అయితే రాజమౌళి, అమీర్ ఖాన్ లాంటివాళ్లకు అలాంటి కోరిక ఉంటే నెరవేరటం ఈజీ. అందుకే ఆమద్యన టాలీవుడ్ లో మహా భారతం సినిమా తీస్తాను అని గతంలో రాజమౌళి తన కోరికగా తెలియచేశారు… అయితే తర్వాత ఆమీర్ ఖాన్ మహాభారతం తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.. అలాగే ఆయన దీనిని ఐదు భాగాలు వెబ్ సీరిస్ గా తీస్తాను అని ప్రకటించారు. . చివరక ఈ వెబ్ సిరీస్ కోసమే ఒక భారీ సినిమాని కూడా కాదనుకున్నాడు. రైటర్లకు, డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆమీర్ ఇప్పుడు ఈ సినిమావల్ల కలిగే లాభ నష్టాలను అంచనా వేసి వద్దనుకున్నారట.

గత కొద్ది కాలంగా ఈ వెబ్ సీరిస్ తీయాలా వద్దా అని అమీర్ ఆలోచనలో పడి, చివరకు వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందిఐతే, వెబ్ సిరీస్ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో అమీర్ ఖాన్ ఆ ఆలోచనని విరమించుకున్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను తీసిన కంటెంట్ ని టార్గెట్ చేస్తారని, మహా భారతం తీసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా తనని ఇరికిస్తారని అమీర్ ఖాన్ భావిస్తున్నాడని తెలుస్తోంది.
మరో ప్రక్క ఇలాంటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించాలంటే ఎంతో సృజనాత్మకత, ప్రశాంతమైన వాతావరణం కావాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. చారిత్రాత్మక కథలను, పురాణగాథలను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది.కాబట్టి అమీర్ ఖాన్ నుంచి ‘మహాభారతం’ రాదు.
ఇక ఆ మధ్యన ‘మహాభారతం’లో నటించాలనుకున్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, ఆ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన వెయ్యి కోట్ల ఆ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు రాజమౌళి ఈ ప్రాజెక్టుపై ఇక దృష్టి పెట్టచ్చేమో.