హైదరాబాద్ నుండి ముంబై చెక్కేసిన పూజా హెగ్డే!

Published : Jan 17, 2021, 04:52 PM IST
హైదరాబాద్ నుండి ముంబై చెక్కేసిన పూజా హెగ్డే!

సారాంశం

పూజా హెగ్డే ముంబై ప్రయాణానికి గల కారణం హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడమే. ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రత్యేకమైన సెట్ లో 30రోజులుగా నిరవధిక షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు.   


స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హైదరాబాద్ నుండి ముంబై చెక్కేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేశారు. పూజా హెగ్డే ముంబై ప్రయాణానికి గల కారణం హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడమే. ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రత్యేకమైన సెట్ లో 30రోజులుగా నిరవధిక షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. 

ఇక తన పార్ట్ కి సంబందించిన షూట్ పూర్తి కావడంతో ముంబైలోని తన నివాసానికి పూజా హెగ్డే వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా రివీల్ చేశారు. రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇటలీ నేపథ్యంలో నడిచే సెన్సిబుల్ లవ్ స్టోరీగా దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ లో రాధే శ్యామ్ మూవీ విడుదల కానుంది. 

దీనితో పాటు పూజా తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో నటిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సన్నద్ధం అవుతుంది. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్