హరికృష్ణ మరణంతో హీరోయిన్ కష్టాలు!

By Udayavani DhuliFirst Published 7, Sep 2018, 5:43 PM IST
Highlights

తెలుగులో 'దువ్వాడ జగన్నాథం' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'అరవింద సమేత' సినిమాలో నటిస్తోంది.

తెలుగులో 'దువ్వాడ జగన్నాథం' చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'అరవింద సమేత' సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటిస్తోంది. అలానే ప్రభాస్ తదుపరి సినిమాకు కూడా సైన్ చేసింది. అయితే ఇటీవల హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోవడంతో 'అరవింద సమేత' సినిమా షూటింగ్ ఐదు రోజుల పాటు వాయిదా పడింది.

దీంతో ఆ సినిమాకు డేట్స్ కేటాయించిన పూజా తన కాల్షీట్స్ మళ్లీ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క ఇక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే.. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుగుతోన్న 'హౌస్ ఫుల్4' షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంటోంది. అయితే హైదరాబాద్ నుండి జైసల్మేర్ కి కేవలం ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉండడం, అందులో వెళ్లడానికి చాలా సమయం పడుతుండడంతో ఆ ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఓ ప్రయివేట్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకోవాలని అనుకుంది. జైసల్మేర్ ప్రాంతంలో సైనిక ఆంక్షల కారణంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడింది. ఆమె మేనేజర్, నిర్మాతలు ఈ విషయంపై రాజస్థాన్ మిలిటరీని సంప్రదించి ప్రయివేట్ జెట్ లో ప్రయాణించడానికి అనుమతులు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Last Updated 9, Sep 2018, 2:13 PM IST