Pooja Hegde: ఎఫ్ 3లో ఐటెం నంబర్ చేయనున్న పూజా... ఎంత తీసుకుంటుందో తెలిస్తే మైండ్ బ్లాక్!

Published : Apr 11, 2022, 08:40 PM IST
Pooja Hegde: ఎఫ్ 3లో ఐటెం నంబర్ చేయనున్న పూజా... ఎంత తీసుకుంటుందో తెలిస్తే మైండ్ బ్లాక్!

సారాంశం

రంగస్థలం మూవీలో జిగేల్ రాణి... అంటూ నాటు స్టెప్స్ తో ఇరగదీసింది పూజా హెగ్డే. ఆ మూవీ విడుదలై నాలుగేళ్లు దాటిపోతుండగా... మరోసారి ఐటమ్ భామగా పూజా కనువిందు చేయనుంది. అయితే దీని కోసం ఆమె కోరుతున్న రెమ్యూనరేషన్ మాత్రం చుక్కల్లో ఉందని సమాచారం.   

స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం నంబర్స్ చేస్తున్నారు. తమన్నా ఫార్మ్ లో ఉన్నప్పుడే ఐటెం గర్ల్ గా మారారు. ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఇటీవల సమంత సైతం ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ ల పాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేశారు. ఊ అంటావా ఊ ఊ అంటావా... సాంగ్ ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది. దేశాన్ని మొత్తం ఊపేసింది ఈ ఐటెం సాంగ్. ఈ ఒక్క సాంగ్ కి సమంత కోటి రూపాయలకు పైనే ఛార్జ్ చేసినట్లు సమాచారం అందుతుంది. 

ఇక స్టార్ లేడీగా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేను ఐటెం సాంగ్ చేయాలంటూ నిర్మాతలు సంప్రదించినట్లు వార్తలు అందుతున్నాయి.   వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ల మల్టీస్టారర్‌ ఎఫ్‌3 సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ లో పూజ కనిపించనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గతంలో పూజా హెగ్డే (Pooja Hegde) గతంలో రంగస్థలం సినిమాలో 'జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌రాణి..' అంటూ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. మరోసారి ఐటం సాంగ్‌ ఆఫర్‌ రాగా అందుకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. దానికోసం పూజా ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఓ సాంగ్ మహా అయితే మూడు నుండి నాలుగు రోజుల్లో షూట్ చేస్తారు. ఇంత తక్కువ సమయంలోనే అంత సంపాదన అంటే మాములు విషయంకాదు . పూజా కోరిక రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడిన చిత్ర యూనిట్, డీల్ ఓకే చేశారట. కాబట్టి ఎఫ్3 మూవీ (F3 Movie) లో పూజా ఐటెం గర్ల్ గా తన గ్లామర్ తో దుమ్మురేపనుంది. ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్‌ 3 సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 27న విడుదల కానుంది.

మరోవైపు పూజా హెగ్డే నటించిన బీస్ట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 13న బీస్ట్ భారీ ఎత్తున విడుదల కానుంది. ఇదే నెలలో ఆమె నటించిన ఆచార్య విడుదలకు సిద్దమవుతుంది. ఏప్రిల్ 19న ఈ మూవీ థియేటర్స్ లో దిగనుంది. అలాగే మహేష్-త్రివిక్రమ్ చిత్రంలో పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్-హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్ మూవీలో కూడా పూజా హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?